ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun ) పుష్ప 2 సినిమా( Pushpa 2 ) ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.ఈ సినిమా డిసెంబర్ ఐదో తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు.
ప్రస్తుతం వరుస ఈవెంట్లతో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు.ఇక ఈ సినిమా విడుదలకు సమయం తక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి వరుస అప్డేట్స్ అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు.
ఇకపోతే తాజాగా ఈయన సోషల్ మీడియా వేదికగా ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యిందంటూ ఒక ఫోటోని షేర్ చేశారు.లాస్ట్ డే షూటింగ్లో భాగంగా ఒక పెళ్లి వేడుకకు సంబంధించిన షూటింగ్ జరిగిందని తెలుస్తోంది.ఈ షూటింగ్ కి సంబంధించిన ఫోటోని ఈయన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పుష్ప లాస్ట్ డే షూట్ ( Last Day Shoot )అంటూ చెప్పుకు వచ్చారు.పుష్ప యూనిట్ తో నా ఐదేళ్ల ప్రయాణం ముగిసింది.
ఇది అద్భుతమైన ప్రయాణం అంటూ ఈయన లవ్ సింబల్ ను జోడించి ఈ ఫోటోని షేర్ చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక ఈ సినిమా షూటింగ్ ఇంకా మిగిలి ఉందని అందుకే మరోసారి ఈ సినిమా వాయిదా పడుతుంది అంటూ ఇదివరకు ఎన్నో రకాల వార్తలు వినిపించాయి.ఈ సినిమా షూటింగ్ పూర్తి కాకపోవడంతో ఎడిటింగ్, ప్రమోషన్లకు పెద్దగా సమయం లేదని అందుకే మరోసారి సినిమా విడుదల విషయంలో మేకర్స్ పునరాలోచనలోఉన్నట్టు వార్తలు వినిపించాయి కానీ అవి ఇవి నిజం కాదని సినిమా షూటింగ్ పూర్తి అయిందని స్పష్టంగా తెలుస్తుంది.అనుకున్న విధంగానే డిసెంబర్ ఐదవ తేదీ అల్లు అర్జున్ వైల్డ్ ఫైర్ ఎలా ఉంటుందో చూపించడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.