యూపీఎస్సీ సివిల్స్( UPSC Civils ) పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు.ఈ ఉద్యోగాలలో చేరిన వాళ్లు ఎన్నో సవాళ్లను ఎదుర్కొనే అవకాశం అయితే ఉంటుంది.
ఐపీఎస్ ఆఫీసర్( IPS Officer ) జాబ్ లో చేరిన వాళ్లకు ఎదురయ్యే ఇబ్బందులు మాత్రం అన్నీఇన్నీ కావు.ఆ సవాళ్లను అధిగమిస్తే మాత్రమే కెరీర్ పరంగా ఎంతోమందికి స్పూర్తిగా నిలిచే ఛాన్స్ అయితే ఉంటుంది.
అయితే ఒక వ్యక్తి 30 లక్షల ఉద్యోగానికి రాజీనామా చేసి వార్తల్లో నిలిచారు.అతని పేరు కృష్ణకుమార్ బిష్ణోయ్( Krishna Kumar Bishnoi ) కాగా అతని సక్సెస్ స్టోరీ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
రాజస్థాన్ రాష్ట్రంలోని( Rajasthan ) బార్మర్ జిల్లాలో ఉన్న చిన్న గ్రామంలో కృష్ణకుమార్ జన్మించారు.కృష్ణ తన ప్రాథమిక విద్యను గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో అభ్యసించారు.కాలినడకన స్కూల్ కు వెళ్లి కృష్ణకుమార్ చదువుకున్నారు.
బాల్యం నుంచి కృష్ణ చదువులో చురుకుగా ఉండేవారు.పదో తరగతిలో ఫస్ట్ డివిజన్ లో ఉత్తీర్ణత సాధించిన కృష్ణకుమార్ 12వ తరగతి చదివిన తర్వాత దేశ రాజధాని ఢిల్లీకి చేరుకుని అక్కడ బీఏ చదివారు.ఫ్రెంచ్ ప్రభుత్వం నుంచి ఆయన 40 లక్షల రూపాయల స్కాలర్ షిప్ పొందారు.2015 సంవత్సరంలో పారిస్ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ అఫైర్స్ నుంచి ఇంటర్నేషనల్ సెక్యూరిటీలో ఆయన మాస్టర్ డిగ్రీ అందుకున్నారు.
ఆ తర్వాత కృష్ణకుమార్ కు ఐక్యరాజ్యసమితి ట్రేడ్ సెంటర్ లో 30 లక్షల రూపాయల వార్షిక ప్యాకేజీతో జాబ్ వచ్చింది.ఆ తర్వాత జాబ్ కు రాజీనామా చేసిన కృష్ణకుమార్ బిష్ణోయ్ భారత్ కు తిరిగి వచ్చారు.సెల్ఫ్ స్టడీ ద్వారా యూపీఎస్సీ పరీక్షలకు ప్రిపేర్ అయిన ఆయన 24 ఏళ్లకే యూపీఎస్సీ ఉత్తీర్ణత సాధించడం ద్వారా వార్తల్లో నిలిచారు.
ఇతని సక్సెస్ స్టోరీని నెటిజన్లు సైతం ఎంతగానో ప్రశంసిస్తున్నారు.