“కాదేది కవితకు అనర్హం” అని మహాకవి శ్రీశ్రీ అన్నట్టు, మెదడులో ఆలోచన ఉండాలే గాని, ఎటువంటి ఆవిష్కరణలు అయినా చేయొచ్చు అని ఎంతోమంది ఇంతకుముందు నిరూపించారు… నేడు నిరూపిస్తున్నారు….మున్ముందు మరెందరో నిరూపిస్తారు కూడా.
ఈ డిజిటల్ యుగం మొదలైన నాటి నుండి అటువంటి ఆవిష్కరణలకు సంబంధించిన వీడియోలను మనం తరచూ చూస్తూ ఉన్నాము.తాజాగా అటువంటివో వినూత్న ఆవిష్కరణకు సంబంధించి ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.
మరి ముఖ్యంగా ఎక్కువగా వాహనం తయారీలోనే అత్యున్నత ఆవిష్కరణలు అనేవి వెలువడటం మనం చూస్తూ ఉన్నాము.సాధారణంగా కారులో( Car ) పయనించడం అనేది ప్రతి మధ్యతరగతి కుటుంబానికి చెందిన వారికి కలలాగా అనిపిస్తుంది.ఇక కారును సొంతం చేసుకోవడం అనేది అందని ద్రాక్ష గానే మిగిలిపోతూ ఉంటుంది.అందుకనే ఏమో ఇక్కడ ఒక యువకుడు తన ఆటోని( Auto ) కారుగా మలచి చూపరులను ఆశ్చర్యపోయేలా చేశాడు.
ఇది సరిగ్గా ఎక్కడ జరిగిందో వివరాలు తెలియడం లేదు గాని, అతను టాలెంట్ చూసి, ఇంజనీర్లు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు.ఒక వ్యక్తి తన దగ్గర ఉన్న త్రీ వీలర్ ఆటోని( Three Wheeler Auto ) కారులా రూపొందించి, ఏం చెక్క రోడ్లపై చెక్కర్లు కొడుతున్నాడు.ఈ తంతును చూసిన ఓ నెటిజన్ వీడియోని తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం బయటపడింది.దాంతో సోషల్ మీడియా జనాలు తమ తమ కామెంట్లతో సదరు యువకుడు పై ప్రశంసలు గుప్పిస్తున్నారు.
చదువుకున్న మాకే ఇలాంటి ఐడియాలు రావు అని కొంతమంది కామెంట్లు చేస్తే, పొరపాటున మీరు ఇంజనీరింగ్ చేయలేదు… లేదంటే మాలాంటి వాళ్ళు సర్దుకోవాల్సి ఉంటుంది! అంటూ సదరు యువకుడు పై ప్రశంసలు గుప్పిస్తున్నారు.ఇక ఈ వీడియోని మీరు చూసినట్లయితే కింద కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాకు తెలియజేయండి!
.