మీ దగ్గర కర్రీ స్మెల్ రాకూడదా.. ఈ ఎన్నారై మహిళ చిట్కాలు తెలుసుకోండి..!

విదేశాల్లో చాలామంది భారతీయులపై జాత్యహంకార వ్యాఖ్యలు చేస్తుంటారు.ముఖ్యంగా మీ నుంచి కర్రీ వాసన( Curry Smell ) వస్తోందంటూ ఆట పట్టిస్తుంటారు.

 Nri Woman Viral Video To Avoid Indian Food Curry Smell Details, Shivee Chauhan,-TeluguStop.com

అయితే అమెరికాలో నివసిస్తున్న ఇండియన్ కంటెంట్ క్రియేటర్ శివీ చౌహాన్( Shivee Chauhan ) తన రీసెంట్ వీడియోలో ఈ సమస్యకు పరిష్కారం చూపారు.అలానే ఆమె షేర్ చేసిన ఈ ఇన్‌స్టాగ్రామ్‌ తీవ్ర చర్చకు దారి తీసింది.

ఈ వైరల్ వీడియోలో( Viral Video ) భారతీయులు తరచూ ‘కర్రీ స్మెల్’ వస్తారనే అభిప్రాయం గురించి శివీ చర్చించారు.తమ దుస్తులపై భారతీయ ఆహార వాసన రాకుండా ఉండేందుకు ఆమె కొన్ని చిట్కాలను పంచుకున్నారు.

భారతీయ ఆహారాన్ని( Indian Food ) చాలా ఇష్టపడినా, బయటకు వెళ్ళేటప్పుడు తన దుస్తులపై ఆ వాసన రాకుండా ఉండటానికి ఇష్టపడనని శివీ చెప్పారు.దీనిని నివారించడానికి, ఆమె కొన్ని సింపుల్ టిప్స్ వెల్లడించారు.

ఆమె వీడియోలో ఆహారం తయారు చేసేటప్పుడు “వంట చేసే దుస్తులు” ధరించారు.ఇంటికి వచ్చిన వెంటనే ఆఫీస్‌కు వేసుకెళ్లిన బట్టలు మార్చుకున్నారు.

అంటే బయటికి వెళ్లడానికి ధరించే బట్టలకు మసాలా దినుసులు, ఉల్లిపాయలు, వెల్లుల్లి వాసన పట్టదు ఓన్లీ వంట వస్తువులకు మాత్రమే ఆ వాసన అనేది పడుతుంది.

ఈ వీడియోలో వంట చేసే సమయంలో జాకెట్లు ధరించకూడదని ఆమె సూచించారు.ఆమె అభిప్రాయం ప్రకారం, వంట వాసనలు జాకెట్‌లకు బాగా అతుక్కుపోతాయి, డ్రై క్లీనింగ్ చేసినా కూడా వాటిని తొలగించడం కష్టం.దీనిని నివారించడానికి, వంట చేసేటప్పుడు జాకెట్లను క్లోసెట్లలో ఉంచాలని ఆమె సూచించారు.

అంతేకాకుండా, బయటకు వెళ్లే ముందు తన దుస్తులను మార్చుకుంటానని, దీని వల్ల ఎలాంటి వాసనలు ఉండవని శివీ చెప్పారు.

ఈ వీడియో ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో 7.8 మిలియన్ల వ్యూస్‌ను సంపాదించింది.దీనిపై రకాల రియాక్షన్స్ వచ్చాయి.

కొంతమంది ఆమె ప్రాక్టికల్ టిప్స్ ఇచ్చినందుకు అభినందించారు.ఒక నెటిజన్ వంట చేసేటప్పుడు, ముఖ్యంగా ఎయిర్ వెంట్ వంటగదికి దగ్గరగా ఉంటే, ఎయిర్ కండిషనర్ లేదా హీటింగ్ సిస్టమ్‌ను ఆఫ్ చేయాలని సూచించారు.

మరికొందరు ఆమె ఉపయోగకరమైన సూచనలకు కృతజ్ఞతలు తెలిపారు.కొందరు మాత్రం భారతీయులు మాత్రమే ఇంత కష్టపడాల్సిన అవసరం ఏంటి? చెడుగా కామెంట్లు చేసే వారికి బుద్ధి చెప్పాలి కానీ ఇలా మనం వారికి నచ్చేలా వారు మెచ్చేలా ఉండటానికి కష్టపడాల్సిన అవసరం లేదు అని అన్నారు.చాలామంది దగ్గర వాసన వస్తుంది మరి కర్రీ వాసన వస్తే ఏంటి ప్రాబ్లం అని కొంతమంది క్వశ్చన్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube