డ్యూటీ చేస్తుండగా ఎదురుపడ్డ పులి.. ఫారెస్ట్ గార్డ్స్‌ ఏం చేశారంటే..?

అడవిలో డ్యూటీ చేసే అధికారులకు అటవీ మృగాల నుంచి ఎప్పుడూ ప్రమాదమే పొంచి ఉంటుంది.ఇటీవల మధ్యప్రదేశ్‌లోని సాత్పురా టైగర్ రిజర్వ్‌లో( Satpura Tiger Reserve ) విధులు నిర్వహిస్తున్న అన్నూలాల్, దహాల్ అనే ఫారెస్ట్ గార్డ్స్‌కు సడెన్‌గా ఓ బెంగాల్ టైగర్‌ ఎదురుపడింది.

 Forest Guard Meets Tiger In Madhya Pradesh Satpura Reserve Video Viral Details,-TeluguStop.com

టైగర్( Tiger ) వస్తున్న శబ్దం విన్న వెంటనే వారు ఒక చెట్టు ఎక్కి సురక్షితంగా ఉండే ప్రయత్నం చేశారు.అనంతరం టైగర్ అక్కడి నుంచి వెళ్లే వరకు అన్నూలాల్ తన మొబైల్‌తో ఈ దృశ్యాన్ని రికార్డ్ చేశారు.

టైగర్ వెళ్లిపోయిన తర్వాత ఇద్దరూ కూడా సురక్షితంగా తమ గమ్యాన్ని చేరుకున్నారు.

వీరు బెంగాల్ టైగర్‌ను ఫేస్ టు ఫేస్ చూసిన దృశ్యాలకు సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఆ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ పర్వీన్ కాస్వాన్( IFS Parveen Kaswan ) సోమవారం పంచుకున్నారు.వీడియోలో, ఒక చెట్టుపై కూర్చున్న ఫారెస్ట్ గార్డ్( Forest Guard ) కింద నుంచి ఒక టైగర్ నడవటం మీరు చూడవచ్చు.ఫారెస్ట్ గార్డ్స్‌ ధైర్యం, వేగవంతమైన ఆలోచనలను కాస్వాన్ ప్రశంసించారు.“అన్నూలాల్, దహాల్ అనే ఇద్దరు ఫారెస్ట్ గార్డ్స్‌ సాత్పురా టైగర్ రిజర్వ్‌లో విధులలో ఉన్నప్పుడు ఒక టైగర్‌ను ఎదుర్కొన్నారు.వారిలో ఒకరు దీన్ని మొబైల్‌లో బంధించారు.తమని తానే కాకుండా వన్యప్రాణులు, అడవులను రక్షించడానికి ఇలానే తెలివిగా ప్రవర్తించాలి.” అని ఆయన రాశారు.

అలానే అడవుల్లో పని చేయడం ఎంతటి ప్రమాదకరమో వివరించారు.అయినప్పటికీ, అన్నూలాల్, దహాల్‌లు చాలా ప్రశాంతంగా వ్యవహరించడం వల్లే ఈ ప్రమాదం నుండి తప్పించుకోగలిగారు అని అన్నారు.వారి ధైర్యం, తెలివితేటలు అభినందనీయమని తెలిపారు.

ఈ వైరల్ వీడియో( Viral Video ) ఇప్పటికే 20 లక్షలకు పైగా మంది చూశారు.ఈ వీడియోను చూసిన ఒక నెటిజన్, “మీరు టైగర్‌ను చూసేలోపు, టైగర్ ఇప్పటికే మిమ్మల్ని పది సార్లు చూసి ఉంటుంది” అని కామెంట్ చేశారు.

మరొకరు, “55 సెకన్ల వద్ద టైగర్ గార్డ్స్‌ను చూసి వారిని వదిలేసింది.బహుశా అది ఆకలితో లేకపోవచ్చు” అని అభిప్రాయపడ్డారు.

మరొకరు, “వారు ఎక్కడానికి చెట్లు దొరికినందుకు వారు అదృష్టవంతులు” అని అన్నారు.

ఇదిలా ఉంటే అస్సాం రాష్ట్రంలోని ఒరాంగ్ నేషనల్ పార్క్‌లో కొన్ని నెలల క్రితం ఓ విషాద సంఘటన చోటు చేసుకుంది.ఆగస్టులో, ఒక ఫారెస్ట్ ఆఫీసర్ మృతదేహం కనిపించింది.ఆ శవం కింద భాగం చీల్చివేయబడిన స్థితిలో కనుగొనబడింది.

అతన్ని మృగం చంపి ఉండవచ్చు అని అనుమానిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube