చిరుధాన్యాల‌తో చెప్ప‌లేన‌న్ని ఆరోగ్య లాభాలు.. ఇంత‌కీ మీ డైట్ లో ఉన్నాయా?

చిరుధాన్యాలు.( Millets ) వీటి గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు.

 Amazing Health Benefits Of Millets! Millets, Millets Benefits, Millets Health-TeluguStop.com

జొన్న‌లు, ( Sorghum )రాగులు, స‌జ్జ‌లు, అరికెలు, సామ‌లు, ఊదలు.ఇలా మన భారత్ లో మొత్తం తొమ్మిది రకాల చిరుధాన్యాలను పండిస్తున్నారు.

త‌క్కువ నీటి వినియోగం మ‌రియు త‌క్కువ విస్తీర్ణంలో పండే చిరుధాన్యాలతో చెప్పలేనన్ని ఆరోగ్య లాభాలు ఉన్నాయి.పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికి చిరుధాన్యాలు ఆరోగ్యపరంగా అపారమైన ప్రయోజనాలను చేకూరుస్తాయి.

చిరుధాన్యాల్లో క్యాల్షియం, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ బి, ఫైబర్, ప్రోటీన్.ఇలా ఎన్నో విలువైన పోషకాలు నిండి ఉంటాయి.

వీటిలో గ్లూటెన్ అస్సలు ఉండదు.

Telugu Tips, Healthy, Latest, Millets-Telugu Health

పూర్వం ధాన్యం కంటే చిరుధాన్యాలకే అధిక ప్రాధాన్యత ఇచ్చేవారు.కానీ ధాన్యం వినియోగం పెరిగిన తర్వాత చిరుధాన్యాలను పక్కన పెట్టేశారు.హెల్త్, ఫిట్ నెస్ పై శ్రద్ధ ఉన్నవారు ఇప్పుడు మళ్లీ వాటి వైపు చూస్తున్నారు.

బియ్యం, గోధుమల స్థానంలో చిరుధాన్యాలను రీప్లేస్ చేసుకుంటే మీ ఆరోగ్యానికి తిరుగే ఉండదు.ముఖ్యంగా మధుమేహం ఉన్న వారికి చిరుధాన్యాలు ఒక వరం అని చెప్పుకోవాలి.మధుమేహం బాధితులు చిరుధాన్యాలను ఆహారంలో భాగం చేసుకుంటే.అవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి.

గట్ ఆరోగ్యాన్ని కాపాడతాయి.

రాగులు, సజ్జలు వంటి చిరుధాన్యాలు త్వరగా జీర్ణం అవుతాయి.

శరీరంలో పోషకాల స్థాయిలు పెంచుతాయి.ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలకు అవసరం అయ్యే ఫోలిక్ యాసిడ్ చిరుధాన్యాల ద్వారా పొందవచ్చు.

అలాగే చిరుధాన్యాల్లో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్‌ మన రోక నిరోధక వ్యవస్థ( The immune system )ను బలపరుస్తాయి.

Telugu Tips, Healthy, Latest, Millets-Telugu Health

అంతేకాదు చిరుధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల వాటిలో ఉండే పోషకాలు కొలెస్ట్రాల‌ను( Cholesterols ) కరిగించి గుండెకు ఏ ముప్పు రాకుండా చూసుకుంటాయి.అలాగే శరీరంలో క్యాన్సర్ కణాలతో పోరాడతాయి.శరీర బరువును అదుపులో ఉంచుతాయి.

కండరాలు, ఎముకలను బలోపేతం చేస్తాయి.మరియు నిద్రలేమి సమస్యను( Insomnia problem ) సైతం దూరం చేస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube