వైరల్ వీడియో: గోల్డ్ టీ గురించి ఎప్పుడైనా విన్నారా.. దాని ధర ఎంతో తెలిస్తే..

చాలామంది తమ రోజును ఓ కప్పు టీ లేదా కాఫీతో ప్రారంభిస్తారు.ఇంట్లో టీ తయారు చేసుకోవడానికి 10 నుంచి 20 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది.

 Viral Video Dubai Cafe Gold Tea Worth Rs 1 Lakh Details, Luxury Tea, Viral Video-TeluguStop.com

లగ్జరీ హోటళ్లలో 500 నుంచి 700 రూపాయల వరకు ఉంటుంది.కానీ, ఒక కప్పు టీ కోసం లక్ష రూపాయలు చెల్లించాలని ఎవరైనా అనుకుంటారా? కానీ, దుబాయ్‌లోని( Dubai ) ఒక కేఫ్‌లో టీ ధర లక్షకు పైమాటే.దుబాయ్‌ ఫైనాన్షియల్ టవర్స్‌లోని బోహో కేఫ్‌లో( Boho Cafe ) ఒక కప్పు ‘గోల్డ్ కారక్’ టీని ఏకంగా 5000 దిర్హమ్‌లకు అమ్ముతున్నారు.అంటే, భారతీయ కరెన్సీలో దాదాపు 1 లక్ష 14 వేల రూపాయలు! ఈ టీని వెండి కప్పులో పోసి, 24 క్యారట్ల గోల్డ్ రేకుతో అలంకరిస్తారు.

ఈ కేఫ్‌కు యజమాని ఒక భారతీయ సంతతికి చెందిన వ్యక్తి కావడం విశేషం.ఈ గోల్డ్ టీ( Gold Tea ) వీడియో సోషల్ మీడియాలో అప్‌లోడ్ అయ్యి వైరల్ గానూ మారింది.

దుబాయ్‌లోని బోహో కేఫ్ ప్రదేశంలో రెండు రకాల మెనూలు ఉన్నాయి.ఒకవైపు చాలా తక్కువ ధరకే మనకిష్టమైన స్ట్రీట్ ఫుడ్ దొరుకుతుంది.మరోవైపు, లక్షల్లో ఖరీదైన వంటకాలు కూడా ఉన్నాయి! ఈ కేఫ్ యజమాని సుచేత శర్మ మాట్లాడుతూ, “లగ్జరీని ఇష్టపడే వారి కోసం ఏదో ప్రత్యేకమైనది చేయాలని అనుకున్నాం.అదే సమయంలో, అందరికీ అందుబాటులో ఉండే వంటకాలను కూడా అందించాలని నిర్ణయించుకున్నాం” అని చెప్పారు.

ఇక్కడ గోల్డ్ కాఫీ( Gold Coffee ) కూడా లభిస్తుంది.దీని ధర 4,761 దిర్హమ్‌లు.అంటే, భారతీయ కరెన్సీలో దాదాపు 1 లక్ష 9 వేల రూపాయలు! ఈ కాఫీని వెండి గ్లాసులో పోసి ఇస్తారు.అదే గ్లాసును కస్టమర్లు ఇంటికి తీసుకెళ్లవచ్చు.

అంతేకాదు, గోల్డ్ క్రోసాంట్లు, గోల్డ్ నీరు, బంగారం పూత కలిపిన బర్గర్లు, గోల్డ్ ఐస్ క్రీమ్ వంటి వింత వంటకాలు కూడా ఇక్కడ దొరుకుతాయి.ఈ ఖరీదైన టీ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగానే నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.“ఈ టీ తాగడానికి EMI కట్టాలి!” అని ఒకరు నవ్వుతూ కామెంట్ చేస్తే, “ఎంత ఫ్యాన్సీగా ఉన్నా, చివరికి అది టాయిలెట్‌కే వెళ్లాలి కదా” అని మరొకరు అన్నారు.

కొంతమంది ఈ ఖరీదైన వంటకాలను చూసి ఆశ్చర్యపోయినప్పటికీ, చాలామంది దీన్ని విమర్శిస్తున్నారు.“ఇది డబ్బు వృథా” అని ఒకరు అంటే, “వెండి గిన్నెలో, బంగారం పూసినా, ఈ టీ ధర 700 దిర్హమ్‌లకు మించకూడదు.5000 దిర్హమ్‌లు అడగడం అంటే అన్యాయం” అని మరొకరు అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube