సాధారణంగా సైన్స్ పరిజ్ఞానం ప్రకారం వచ్చే గ్రహణం, జ్యోతిష్య శాస్త్రంలో చెప్పే గ్రహణం రెండు వేరుగా ఉంటాయి.సైన్స్ పరంగా అయితే సూర్యుడికి, భూమికి మధ్య చంద్రుడు రావడం వల్ల, భూమి అడ్డు రావడం వల్ల గ్రహణం పట్టడం జరుగుతుంది.
కానీ జ్యోతిష్య శాస్త్రంలో సూర్య, చంద్ర గ్రహాలను రాహు కేతువులు పట్టడం వల్ల గ్రహణం చోటు చేసుకుంటుంది.
అంతే కాకుండా రవి కేతువులు చంద్ర రాహులు కలవడం వల్ల గ్రహణం పట్టినట్లు అవుతుంది.
సూర్య గ్రహణం, చంద్ర గ్రహణం ఫలితాలు రెండు దాదాపు ఒకే విధంగా ఉంటాయి.ముఖ్యంగా చెప్పాలంటే ఏడవ స్థానంలో గ్రహణం పట్టిన పక్షంలో జీవిత భాగస్వామి నుంచి సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
పెళ్లి కాకపోవడం, విడాకులు తీసుకోవడం, భాగస్వామి ఎక్కువగా అనారోగ్య పాలవడం జరుగుతుంది.
ఇంకా చెప్పాలంటే వైవాహిక జీవితం అంత సుఖంగా ఉండదు.వ్యాపారంలో కూడా భాగస్వాముల వల్ల మోసాలు జరిగే అవకాశం ఉంది.ఇంకా చెప్పాలంటే 11వ స్థానంలో గ్రహణం ఏర్పడినట్లయితే జీవితం ఆశించిన స్థాయిలో పురోగతి చెందడం కష్టమవుతుంది.
వృత్తి, ఉద్యోగ, జీవితం ఎంత ప్రతిభ ఉన్న వెలుగులోకి రావడం జరగదు.సాధారణంగా జీవితం అంత ప్రాముఖ్యత లేని ఉద్యోగలతో సరిపెట్టుకోవాల్సి ఉంటుంది.
కాబట్టి ఏ స్థానంలో గ్రహణం పట్టిన పరిహారాలు మాత్రం ఒకే విధంగా చేయాలి.సాధారణంగా జాతకాలలో గ్రహణం ఉన్నవారు ఆదిత్య హృదయం పారాయణం చేయడం వల్ల ఎంతో మంచిది.అంతేకాకుండా గ్రహణ దోషాలు పోవడానికి ఇదే సరైన పరిహారం అని వేద పండితులు చెబుతున్నారు.ఇంకా చెప్పాలంటే ప్రతి రోజు సుందరకాండ పారాయణం చేయడం వల్ల కూడా గ్రహణ దోషాల నుంచి విముక్తి పొందవచ్చు.
DEVOTIONAL