సాధారణంగా మనం గుడికి వెళ్తే భక్తితో దేవున్ని పూజిస్తూ ఉంటాం.కానీ ఓ గుడిలో మాత్రం వెళితే అక్కడ ఆ దేవుడిని తిట్టాల్సిందే అంట.
పైగా భక్తి పాటలకు బదులుగా తిట్ల పాటలు పాడతారట.అంటే కాదు ఆ గుడిలో పూజలు, కొబ్బరికాయ కొట్టడాలు ఉండవు.
అదే అక్కడి ప్రత్యేకమైన ఆచారమట.మరి ఆ గుడి ఎక్కడ ఉంది? ఆ గుడికి ఉన్న ప్రత్యేకత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.కొడుంగల్లూర్ భగవతీ ఆలయంకేరళలోని అత్యంత శక్తివంతమైన పీఠాలలో ఒకటైన ‘కొడుంగల్లూర్ భగవతీ ఆలయం( Kodungallur Sree Kurumba Bagavathi Temple )’ చాలా ప్రత్యేకం.ఎందుకంటే ఈ గుడిలో ఉన్న అమ్మవారి రూపంతో పాటు ప్రతి ఏడాది జరిగే ఏడు రోజుల ఉత్సవాలు చాలా విచిత్రంగా ఉంటాయి.
అయితే ఆ 7 రోజుల ఉత్సవాలలో భక్తులు( Devotees ) కత్తులతో తలపై దాడి చేసుకొని ఆ రక్తంతోనే గుడిలోకి వెళ్తారు.అలాగే ఈ గుడి పైకి రాళ్లు కూడా విసురుతారు.గుడిలోకి వెళ్లి భద్రకాళి అమ్మవారిని నానా తిట్లు తిడతారు.తిట్టడమే కాకుండా భక్తి గీతాల రూపంలో కూడా తిట్టిపోస్తారు.అక్కడితో ఆగకుండా పూనకం వచ్చినట్లు ఊగిపోతూ గుడి పైకి రాళ్లు విసురుతూ ఉంటారు.ఆ ఏడు రోజుల ఉత్సవాల తర్వాత వారం రోజులపాటు ఆలయాన్ని మూసివేసి ఆ రక్తపు మరకల్ని శుభ్రం చేస్తారు.
అయితే మనం దేవుని తిట్టడం ఎక్కడా చూసి ఉండము.
దేవున్ని ఎంత భక్తితో పూజిస్తే మనకు అంత మంచి జరుగుతుందని మనం ఎన్నో రకాలుగా మన ఇష్ట దైవాన్ని పూజిస్తూ ఉంటాము.కానీ ఇక్కడ భక్తులు మాత్రం అమ్మవారిని తిట్టడం వలన మంచి జరుగుతుందని నమ్ముతారు.కాబట్టి ప్రతి ఏడాది ఆ ఏడు రోజులు అమ్మవారిని ఆ విధంగా తిట్టిపోస్తారు.
అలా చేయడం వలన వారికి మంచి జరుగుతుందని వారి నమ్మకం.అమ్మవారిని ఈ విధంగా ఉత్సవాల రోజులలో తిట్టడం వలన అమ్మవారి ఆశీస్సులు వారిపై ఉంటాయని అక్కడి భక్తులు నమ్ముతారు.
కాబట్టి ఈ వింత ఆచారాన్ని వారు అనాది కాలంగా పాటిస్తూ వస్తున్నారు.
DEVOTIONAL