హిందూ క్యాలెండర్ ప్రకారం హిందూ ప్రజలు జరుపుకునే పండుగలలో మహా శివరాత్రి పండుగ ఒకటి ఈ పండుగను ప్రతి ఏడాది ఘనంగా జరుపు కుంటారు.ఆ పరమేశ్వరుడు లింగ రూపంలోకి ఉద్భవించిన రోజున శివరాత్రి పండుగను జరుపు కుంటారని పురాణాలు చెబుతున్నాయి.
ఇక మహా శివరాత్రి రోజు ప్రతి ఒక్కరు శివుడి పూజలో నిమగ్నమయి ఉపవాస దీక్షలతో జాగరణ చేస్తూ స్వామి వారిని పూజిస్తారు.అయితే స్వామివారి అనుగ్రహం మనపై ఉండాలంటే స్వామివారికి పూజ చేసే సమయంలో తప్పని సరిగా కొన్ని నియమాలను పాటించాలి నియమాలు ఏమిటి అనే విషయానికి వస్తే.
మహా శివరాత్రి రోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి తలంటు స్నానం చేయాలి.స్నానానంతరం పూజ గదిని శుభ్రం చేసుకుని పరమేశ్వరుడికి పంచామృతాలతో అభిషేకం చేయాలి.
అయితే స్వామివారికి అభిషేకం చేస్తున్నంతసేపు ఓం నమశ్శివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని చదవాలి.స్వామివారి పూజను చందన లేపనంతో ప్రారంభించి అన్ని కార్యక్రమాలను పూర్తి చేయాలి.
ఇక ఈ విధంగా శివుడి పూజ పూర్తయిన తర్వాత అగ్నిలో నువ్వులు బియ్యం నెయ్యితో కలిపిన అన్నం వేయాలి.ఈ విధంగా చేసి పూర్ణాహుతి ఇవ్వాలి.
ఈ విధంగా స్వామివారికి ఉపవాసంతో పూజ చేసిన అనంతరం తెల్లవార్లు శివ కథలను వింటూ జాగరణ చేయాలి.ఈ విధంగా స్వామివారికి పూజ చేసే సమయంలో తెలుపు రంగు దుస్తులు ధరించి పూజ చేయాలి.ఇక రాత్రి తెల్లవార్లు జాగరణ చేసిన తరువాత మరుసటి రోజు ఉదయం శుభ్రంగా స్నానం చేసి ఏదైనా తీపి పదార్థం చేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పించిన అనంతరం ఉపవాసాన్ని విరమించాలి.ఇలా స్వామివారికి భక్తిశ్రద్ధలతో పూజ చేయటం వల్ల స్వామివారి అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉంటుంది.