బుల్లి తెరపై ప్రసారం అవుతూ ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్న బిగ్ బాస్ కార్యక్రమం ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో 24 గంటల పాటు ప్రసారం ప్రేక్షకులకు మరింత వినోదాన్ని అందిస్తుంది.ఈ క్రమంలోనే గత సీజన్లలో పాల్గొన్న కంటెస్టెంట్ లను వారియర్స్ గాను కొత్తగా ఎంట్రీ ఇచ్చిన వారిని చాలెంజర్స్ గాను విభజించారు.
ఈ క్రమంలోనే ప్రతిరోజు చాలెంజర్స్ నుంచి అనుమతి పొందిన ఒక వారియర్‌కు మాత్రమే బెడ్రూమ్లో నిద్రపోయే అవకాశం ఉంటుందని బిగ్ బాస్ సూచించారు.అదే విధంగా చాలెంజర్స్ భోజనం చేసిన తర్వాత వారియర్స్ అందరూ ఒకేసారి భోజనం చేయాలని బిగ్ బాస్ తెలియజేశారు.
ఇక వారియర్స్ ఎవరు ఏ జాబ్ చేయాలనే దాని కోసం ఒక జాబ్ మేళా కూడా నిర్వహించారు.చాలెంజర్స్ ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా జరిగింది.
అయితే ఈ జాబ్ మేళాలో భాగంగా బోల్డ్ బ్యూటీ అరీయానా, శ్రీరాపాకకు మధ్య కాస్త మాటల యుద్ధం జరిగిందని చెప్పాలి.ఈ ఇంటర్వ్యూలో భాగంగా ప్రతి ఒక్కరు పాల్గొని సందడి చేయగా అరియాన కాస్త ఓవరాక్షన్ చేసింది ఈ క్రమంలోనే శ్రీరాపాక స్పందిస్తూ అంత ఓవరాక్షన్ అవసరం లేదని చెప్పడంతో ఒక్కసారిగా ఆరియానా తనదైన స్టైల్లో సమాధానం చెప్పింది.
ఈ క్రమంలోనే శ్రీ రాపాక అన్న మాటలకు ఆరియానా స్పందిస్తూ… స్టేట్మెంట్స్ ఇవ్వద్దు, నా స్టైల్ ఇలాగే ఉంటుంది.అంటూ ఆరియానా తనదైన స్టైల్ లో కౌంటర్ వేసింది.ఇలా హౌస్ లోకి ఎంటర్ అయిన మొదటి రోజే మాటల యుద్ధం జరుగుతోందని చెప్పవచ్చు.ఇప్పటికే కంటెస్టెంట్ ల మధ్య టాస్క్ లు కూడా మొదలయ్యాయి అలాగే నామినేషన్ల ప్రక్రియ కూడా కొన సాగుతుందని, ఏ కంటెస్టెంట్ ఎవరిని నామినేట్ చేశారు, ఎందుకు నామినేట్ చేశారు .అనే విషయాలు తెలియాలంటే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ నాన్ స్టాప్ స్ట్రీమింగ్ చూడాల్సిందే.