బీట్‌రూట్.ఇదో పోషకాల గని.
చవక ధరకే లభించే ఈ అద్భుతమైన దుంపుల్లో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ బి, విటమిన్ ఇ, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, జింక్, మాంగనీస్, కాపర్, ప్రోటీన్, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా నిండి ఉంటాయి.అందుకే బీట్‌రూట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని, ఆ దుంపలను తరచూ తీసుకోవాలని చెబుతుంటారు.
ఈ నేపథ్యంలోనే పెద్దలు బీట్‌రూట్‌ను డైట్‌లో చేర్చుకుంటారు.కానీ, పిల్లలు బీట్‌రూట్ పేరు వింటే చాలు ఆమడ దూరంలో పారిపోతుంటారు.
సరే తినడం లేదు కదా అని వదిలేస్తే.బీట్‌రూట్ ద్వారా లభించే ఎన్నో అమోఘమైన పోషకాలను, ప్రయోజనాలను పిల్లలు మిస్ అవుతారు.ఆ కారణంగానే పిల్లల చేత బీట్‌రూట్‌ను తినిపించేందుకు నానా తిప్పలు పడుతుంటారు.మీ పిల్లలు కూడా బీట్‌రూట్ తినమని మారాం చేస్తున్నారా.? అయితే డోంట్ వర్రీ.ఇకపై మీ పిల్లలకు బీట్‌రూట్‌ను డైరెక్ట్‌గా లేదా కర్రీ రూపంలో ఇవ్వడం మానేయండి.
మరెలా ఇవ్వాలంటే.ఒక బౌల్ తీసుకుని అందులో కప్పు ఫ్రెష్ పెరుగు, నాలుగు టేబుల్ స్పూన్ల బీట్‌రూట్ తురుము, వన్ టేబుల్ స్పూన్ క్యారెట్ తురుము, రుచికి సరిపడా ఉప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసి బాగా కలిపి పిల్లలకు పెడితే అస్సలు నో చెప్పకుండా తింటారు.
అలాగే బీట్‌రూట్‌తో చపాతీ, పులావ్, దోసె, పాన్ కేక్ ఇలా డిఫెరెంట్‌గా తయారు చేసి పెట్టినా ఖచ్చితంగా పిల్లలు తింటారు.

తద్వారా పిల్లల్లో రక్తహీనత సమస్య ఏర్పడకుండా ఉంటుంది.వారి మానసిక మరియు శారీరక ఎదుగుదల చురుగ్గా సాగుతుంది.పిల్లల్లో జ్ఞాపకశక్తి, ఆలోచన శక్తి.
రెండు రెట్టింపు అవుతాయి.నీరసం, అలసట వంటివి వారి దరి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.
ఇమ్యూనిటీ సిస్టమ్ సైతం స్ట్రోంగ్‌గా మారుతుంది.







