బీఆర్ఎస్ పై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.కేసీఆర్ కుటుంబం రూ.10 లక్షల కోట్లు దోచుకుందని ఆరోపించారు.
దేశంలో అత్యంత అవినీతి ముఖ్యమంత్రి కేసీఆరేనని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.
బీజేపీ ద్వారా బీఆర్ఎస్ కు బుద్ది చెప్పాలనుకున్నానన్నారు.కానీ కేసీఆర్ అవినీతిపై కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఎటువంటి చర్యలు తీసుకోలేదని చెప్పారు.
బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనని ప్రజలు అనుకుంటున్నారని తెలిపారు.తప్పుడు నిర్ణయాలతో బీజేపీ బలహీనపడిందన్న కోమటిరెడ్డి తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని పేర్కొన్నారు.
మునుగోడు ప్రజల కోరిక మేరకే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు.తాను ఏ పార్టీలో ఉన్నా కేసీఆర్ ను గద్దె దించడమే లక్ష్యమని స్పష్టం చేశారు.







