భారత జట్టు స్టార్ బ్యాట్స్ మెన్స్ బౌలింగ్ చేయలేక పోవటం జట్టుకు నష్టమా-లాభమా..!

ప్రస్తుత భారత జట్టులో కొనసాగుతున్న కెప్టెన్ రోహిత్ శర్మతో( Rohit Sharma ) పాటు విరాట్ కోహ్లీ,( Virat Kohli ) శుబ్ మన్ గిల్, కేఎల్.రాహుల్, శ్రేయస్ అయ్యర్, సూర్య కుమార్ యాదవ్.

 India Star Batsmen Inability To Bowl Is A Loss Or A Gain For The Team Details, I-TeluguStop.com

అందరూ కూడా భయంకరమైన బ్యాట్స్ మెన్స్ అని తెలిసిందే.జట్టు క్లిష్ట పరిస్థితులలో ఉన్నప్పుడు ఒంటి చేత్తో బ్యాటింగ్ చేసి మ్యాచులు గెలిపించే సత్తా ఈ బ్యాటర్లలో ఉంది.

అయితే వీరిలో ఏ ఒక్క బ్యాట్స్మెన్ కూడా బౌలింగ్ చేయలేరు.

భారత జట్టులో ఆల్ రౌండర్ గా హార్థిక్ పాండ్యా,( Hardik Pandya ) రవీంద్ర జడేజా లు( Ravindra Jadeja ) కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

గాయం కారణంగా హార్థిక్ పాండ్యా మరో రెండు మ్యాచ్లకు దూరం అవ్వనున్నాడు.ఇలాంటి పరిస్థితులలో ఏ బ్యాట్స్మెన్ కూడా ధైర్యంగా ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయలేకపోవడం ఆలోచించాల్సిన విషయమే.

న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్లో భారత జట్టుకు చెందిన ఏ రెగ్యులర్ బౌలర్ కు న్యూజిలాండ్ ఆటగాళ్లను 25 ఓవర్ల పాటు కంగారు పెట్టలేకపోయారు.మహమ్మద్ షమీ( Mohammad Shami ) చెలరేగి బ్యాటర్లను కట్టడి చేయకపోతే పరిస్థితి మరోలా ఉండేది.

Telugu Batsmen, India Batsmen, Mohammad Shami, Rohit Sharma, Sehwag, Shreyas Iye

గతంలో సచిన్ టెండూల్కర్, సౌరబ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్ జట్టుకు అవసరం అయినప్పుడు బౌలింగ్ కూడా చేశారు.సచిన్ టెండూల్కర్( Sachin Tendulkar ) వన్డేల్లో 1342 ఓవర్లు బౌలింగ్ చేసి 154 వికెట్లు తీశాడు.సౌరబ్ గంగూలీ( Sourav Ganguly ) 760 ఓవర్లు బౌలింగ్ చేసి 100 వికెట్లు తీశాడు.వీరేంద్ర సెహ్వాగ్ 732 ఓవర్లు బౌలింగ్ చేసి 96 వికెట్లు తీశాడు.

వీరే కాదు జట్టుకు అవసరమైన సమయాల్లో యువరాజ్ సింగ్ సురేష్ రైనా లాంటి బ్యాట్స్మెన్ లు కూడా చక్కగా బౌలింగ్ చేశారు.

Telugu Batsmen, India Batsmen, Mohammad Shami, Rohit Sharma, Sehwag, Shreyas Iye

కాబట్టి ప్రస్తుత భారత జట్టులో స్టార్ బ్యాటర్లుగా కొనసాగుతున్న శ్రేయస్ అయ్యర్,( Shreyas Iyer ) శుబ్ మన్ గిల్,( Subhman Gill ) సూర్య కుమార్ యాదవ్( Suryakumar Yadav ) బౌలింగ్ పై కూడా దృష్టి పెడితే అవసరమైన సమయాలలో జట్టును ఆదుకోవచ్చు.కీలక బౌలర్లు గాయాలకు గురైన, రెగ్యులర్ బౌలర్లు పొరపాటున తేలిపోతే ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేసేందుకు మన భారత జట్టు బ్యాట్స్ మెన్స్ బ్యాటింగ్ పైనే కాకుండా బౌలింగ్ పై కూడా దృష్టి పెడితే జట్టు పటిష్టంగా ఉండి వరుసగా విజయాలు సాధిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube