పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ప్రస్తుతం వరుసగా సినిమా లు చేస్తున్న విషయం తెల్సిందే.రోజుకు కోటి కి పైగా పారితోషికం తీసుకుంటూ సినిమా లు చేస్తున్నాడు.
ఆ మధ్య పీపుల్స్ మీడియా వారు భారీ మొత్తంలో పారితోషికం ను ఇచ్చి పవన్ కళ్యాణ్ తో వినోదయ్య సీతమ్ సినిమా రీమేక్( Vinodhaya Sitham Remake ) ను రూపొందించిన విషయం తెల్సిందే.ఆ సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యింది.
అతి త్వరలోనే సినిమా విడుదల తేదీ విషయంలో క్లారిటీ ఇవ్వబోతున్నారు.ఇక వినోదయ్య సీతమ్ తర్వాత పవన్ చేస్తున్న సినిమా లు ఓజీ మరియు ఉస్తాద్ భగత్ సింగ్.
ఈ రెండు సినిమా ల చిత్రీకరణ సమాంతరంగా సాగుతోంది.ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా( Ustaad Bhagat Singh ) ను హరీష్ శంకర్ దర్శకత్వం లో పవన్ కళ్యాణ్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఆ సినిమా కోసం పవన్ కళ్యాణ్ కి దాదాపుగా వంద కోట్ల పారితోషికం( 100Crore Remuneration ) ఇవ్వడం జరిగింది అంటూ వార్తలు వస్తున్నాయి.ఇప్పటి వరకు పవన్ చాలా సినిమా ల్లో నటించాడు.అన్నింటికి మించి ఈ సినిమా యొక్క పారితోషికం ఉంటుంది అన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.మైత్రి వారు ఈమధ్య కాలంలో భారీ ఎత్తున ఖర్చు చేస్తున్నారు.

కనుక ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా యొక్క పారితోషికం కు తగ్గట్లుగానే కాస్త ఎక్కువ రోజుల డేట్లు ఇవ్వడం జరిగిందట.ఇప్పటి కే ఒక షెడ్యూల్ ను ముగించిన దర్శకుడు త్వరలోనే కొత్త షెడ్యూల్ ను మొదలు పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది.వంద కోట్ల పారితోషికంను ఇవ్వడంతో కొందరు మైత్రి మూవీ మేకర్స్( Mythri Movie Makers ) బ్యానర్ లో పవన్ కళ్యాణ్ రెండు సినిమా లు చేయబోతున్నాడు అంటూ కూడా ప్రచారం చేస్తున్నారు.అసలు విషయం ఏంటీ అనేది క్లారిటీ రావాల్సి ఉంది.