ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో విశాఖ ఉక్కు పరిశ్రమ( Visakha Steel Plant ) చాలా కీలకంగా మారిన సంగతి తెలిసిందే.కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ విషయంలో వెనక్కి తగ్గేది లేదని ఇటీవల తెలియజేయడం జరిగింది.
మరోపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ( Visakha Steel Plant Privatization ) జరగకుండా అడ్డుకుంటామని ప్రకటనలు చేస్తున్నాయి.ఇక ఇదే విషయంపై తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ బీఆర్ఎస్ నేతలు సైతం విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ జరగకుండా అడ్డుకోబోతున్నట్లు.
అది కేవలం కేసీఆర్ వల్లే సాధ్యమని కామెంట్స్ చేస్తున్నారు.
పరిస్థితి ఇలా ఉంటే విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం రేపు రాష్ట్రవ్యాప్తంగా లారీల బంద్( Lorry Bundh ) నిర్వహించబోతున్నట్లు రాష్ట్ర లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రకటించడం జరిగింది.
రేపు ఉదయం 9 గంటల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లారీలు ఎక్కడికక్కడ… నిలిపివేయాలని పిలుపునిచ్చింది.విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఎనిమిది వందల రోజులుగా ఉక్కు ఫ్యాక్టరీ కార్మికులు దీక్షలు చేస్తూ ఉన్నారు.32 మంది బలిదానంతో ఆనాడు సాధించుకున్న ఉక్కు పరిశ్రమని ప్రైవేటుపరం కాకుండా ఏపీ రాష్ట్ర లారీల ఓనర్స్ అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.