దీపావళి పండుగ సందర్భంగా బాక్సాఫీస్ వద్ద అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి చాలా రకాల సినిమాలు పోటీపడుతున్నాయి.అలాగే చాలా రకాల వెబ్ సిరీస్ లు, సినిమాలు ఓటీటీలో థియేటర్లలో విడుదల అవుతున్నాయి.
ఇకపోతే ఈ వారం ఓటీటీలో థియేటర్స్ లో సందడి చేయబోతున్న సినిమాల వివరాల విషయానికొస్తే.తెలుగులో లక్కీ భాస్కర్ మూవీ( Lucky Baskhar ) అక్టోబర్ 31న పాన్ ఇండియా లెవల్ లో ఐదు భాషలలో రిలీజ్ అవుతోంది.
దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి ఈ చిత్రంలో జంటగా నటించిన విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.
అలాగే టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన క సినిమా( Ka ) అక్టోబర్ 31 న విడుదలైన విషయం తెలిసిందే.ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్ లో ఐదు భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతోంది.అలాగే కన్నడ నుంచి ప్రశాంత్ నీల్ కథ అందించిన చిత్రం బఘీర పాన్ ఇండియా ప్రాజెక్ట్ గానే ఈ నెల 31 న రిలీజ్ కాబోతోంది.ఈ చిత్రంలో శ్రీ మురళీ, రుక్మిణి వసంత్ జోడీగా నటించారు.
కోలీవుడ్ నుంచి శివ కార్తికేయన్ పాన్ ఇండియా మూవీ అమరన్ రిలీజ్ అవుతోంది.రియల్ లైఫ్ స్టోరీతో తెరకెక్కిన ఈ చిత్రంలో సాయి పల్లవి శివ కార్తికేయన్ కి జోడీగా నటించింది.
దీని పైన చాలా హోప్స్ ఉన్నాయి.పై నాలుగు సినిమాలు అక్టోబర్ 31న గ్రాండియర్ గా ఆయా భాషలలో రిలీజ్ కాబోతున్నాయి.
మూవీ ప్రమోషన్స్ కూడా స్ట్రాంగ్ గా నడుస్తున్నాయి.అదేవిధంగా హిందీలో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ చిత్రంగా రోహిత్ శెట్టి సింగం అగైన్( Singham Again ) నవంబర్ 1న రిలీజ్ కానుంది.అలాగే కార్తీక్ ఆర్యన్ భూల్ భూలయ్యా 3 కూడా అదే రోజు ప్రేక్షకుల ముందుకొస్తోంది.ఈ సినిమాలన్నీ కూడా థియేటర్లలో విడుదల ఉన్నాయి.ఇకపోతే ఓటీటీలో రిలీజ్ కాబోయే మూవీస్, సిరీస్ ల విషయానికి వస్తే.జీ5లో మిధ్య అనే వెబ్ సిరీస్ తెలుగు వెర్షన్ నవంబర్ 1 నుంచి స్ట్రీమింగ్ లోకి వస్తోంది.ఈ టీవీ విన్ లో లవ్ మాక్ టైల్ సీజన్ 2 అనే వెబ్ సిరీస్ నవంబర్ 1న రిలీజ్ కాబోతోంది.అమెజాన్ ప్రైమ్ లో గోళం అనే మూవీ స్ట్రీమింగ్ నవంబర్ 1 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
కాగా నెట్ ఫ్లిక్స్ లో మర్డర్ మైండ్ ఫుల్లీ( అనే హాలీవుడ్ మూవీ అక్టోబర్ 31 నుంచి విడుదల కానుంది.అలాగే ది డిప్లొమ్యాట్ సీజన్ 2 అనే హాలీవుడ్ వెబ్ సిరీస్ కూడా అక్టోబర్ 31 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.