బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ' డ్రగ్స్ ' రచ్చ 

తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్( Congress) , ప్రధాన ప్రతిపక్షం బీ ఆర్ ఎస్(BRS) మధ్య పంచాయతీ ప్రస్తుతం నడుస్తోంది.ఈ డ్రగ్స్ వ్యవహారం పైనే ఒకరికొకరు విమర్శలు,  ప్రతి విమర్శలు చేసుకుంటూ తెలంగాణ (Telangana)రాజకీయాన్ని మరింత వేడెక్కించే పనిలో ఉన్నారు.

 'drugs' Ruckus Among Brs Congress, Brs, Kcr, Ktr, Congress, Brs Leaders, Drugs I-TeluguStop.com

బీఆర్ఎస్ నేతలు అందరికీ డ్రగ్స్ టెస్ట్ చేయించాలని కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్(Anil Kumar yadav ),  బలమూరు వెంకట్(balmuri Venkat) లు డిమాండ్ చేస్తున్నారు.  బీఆర్ఎస్ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది.

ఎంపీ అనిల్ యాదవ్ ఇంటికి యూరిన్ శాంపిల్స్ పంపిస్తామని,  టెస్టులు చేయించుకోమని బిఆర్ఎస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు .టెస్ట్ లు ఎలా చేయించుకోవాలో తెలియదా,  దమ్ముంటే అందరం కలిసి టెస్టులకు శాంపిల్స్ ఇద్దాం రావాలని అనిల్ కుమార్,  బలుమూరి వెంకట్ సవాల్ చేశారు.

Telugu Balmuri Venkat, Brs, Congress, Congressmp, Drugs, Revanth Reddy-Politics

గచ్చిబౌలి లో ఉన్న ఏఐజి ఆసుపత్రి వద్దకు వెళ్లి రెండు గంటలపాటు ఎదురుచూశారు.సోషల్ మీడియాలో లైవ్ కూడా నిర్వహించారు.అయినా ఎవరూ రాకపోవడంతో వీరిపై ఈరోజు ఉదయమే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (padi Koushik Reddy)తీవ్ర ఆరోపణలు చేశారు.దొంగతనంగా ఆసుపత్రి వద్దకు వెళ్లి సవాల్ విసిరుతున్నారని పాడి కౌశిక్ రెడ్డి విమర్శించారు.

తన కారులో డ్రగ్ పెట్టేందుకు బీఆర్ఎస్ యువనేతలను కేసుల్లో ఇరికించేందుకు రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రయత్నిస్తున్నారని పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు.తనకు పోలీసులే ఈ విషయాన్ని చెప్పారని కౌశిక్ రెడ్డి అన్నారు.

రేవంత్ రెడ్డి గురించి అందరికీ తెలుసునని వాటి గురించి బయట పెడతానని కౌశిక్ రెడ్డి అన్నారు.రేవంత్ రెడ్డి పోలీసుల సాయంతో న తన కారులో డ్రగ్స్ పెట్టాలనుకుంటున్నారని కౌశిక్ రెడ్డి మండిపడ్డారు.

Telugu Balmuri Venkat, Brs, Congress, Congressmp, Drugs, Revanth Reddy-Politics

దీంతో కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేతలు తీవ్రంగానే స్పందిస్తున్నారు.ఈ వ్యవహారం రెండు పార్టీల మధ్య మరింత అగ్గి రాజేష్తోంది.కేటీఆర్ ను ఇరికించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రగా బిఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube