వైఎస్ జగన్(YS Jagan) ,ఆయన సోదరి షర్మిల(Sharmila) మధ్య చెలరేగిన ఆస్తుల వివాదం రోజురోజుకు రాజకీయ రచ్చగా మారుతోంది అన్నా చెల్లెళ్ళ ఆస్తుల వ్యవహారంలో టిడిపి కూడా జగన్ ను టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తోంది.ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలి హోదాలో ఉన్న షర్మిల జగన్ ను ఇరుకున పెట్టే విధంగా, టిడిపికి(TDP) మేలు చేసే విధంగా వ్యవహరిస్తున్నారని వైసీపీ(YCP) నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.
షర్మిల, జగన్ మధ్య లేఖల పంచాయతీ ప్రస్తుతం జరుగుతోంది. ఇక ఈ వ్యవహారంలో జగన్, షర్మిల తల్లి వైఎస్ విజయమ్మ(YS vijayamma) కూడా లేఖలు విడుదల చేయడం మరింత రచ్చగా మారింది.
ఆస్తుల పంపకాల విషయంలో విజయమ్మ షర్మిల కు అండగా నిలబడడం , షర్మిలకు మద్దతుగా బహిరంగ లేఖను విడుదల చేయడం తో టిడిపి రాజకీయంగా అది తమకు అనుకూలంగా మార్చుకుంటోంది.
షర్మిలకు మద్దతుగా లేఖ విడుదల చేసిన విజయమ్మ అందులో కుటుంబ పరమైన సున్నితమైన అంశాలను ప్రస్తావించారు.వీటినే వైసిపి నేతలు తప్పుపడుతున్నారు.2024 ఎన్నికల సమయంలో తమ పార్టీని ఇబ్బంది పెట్టేలా విజయమ్మ వీడియో విడుదల చేశారని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. వైఎస్ఆర్ కుటుంబం పై నిరంతరం కుట్రలు చేసే చంద్రబాబుకు రాజకీయంగా మేలు చేసే విధంగా విజయమ్మ వ్యవహరించడం సరైనదేనా అంటూ వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.జగన్ కు షర్మిల (Jagan ,Sharmila)వ్యక్తిగతంగా రాసిన లేఖ టిడిపి సోషల్ మీడియా అకౌంట్ లో ప్రత్యక్ష కావడం , విజయమ్మ కూడా సంతకం చేసిన ఆ ఉత్తరాన్ని టిడిపి విడుదల చేయడంపై విజయమ్మ వైఖరిని వైసిపి నేతలు ప్రశ్నిస్తున్నారు.
జగన్ ను రాజకీయంగా , ఆర్థికంగా దెబ్బతీయడానికి షర్మిల వేస్తున్న ప్రతి అడుగు రాజకీయ ప్రత్యర్థులకు లబ్ధి చేకూర్చిందని , మూడు నాలుగేళ్లుగా ఇంత జరుగుతున్నా సహనంతో మౌనంగా ఆ బాధను జగన్ అనుభవించారని , ఇలాంటి పరిస్థితుల్లో అసలు బాధితులు ఎవరు? తల్లిగా విజయమ్మ బాసట ఎవరికి ఉండాలనే ప్రశ్నలు వైసిపి లేవనెత్తుతోంది.జగన్ కష్టంతో సంపాదించిన ఆస్తిలో ఎలాంటి హక్కు లేకపోయినా ఆ ఆస్తిలో భాగం కావాలని షర్మిల రాద్ధాంతం చేయడం ఏమిటి ? ఈ విధంగా జగన్ ను ఇరుకున పెట్టేలా లేఖలు రాయడం ఏమిటని వైసీపీ ప్రశ్నిస్తోంది.ఈ కుట్రలో టిడిపి కూడా భాగస్వామ్యం అయ్యిందని విజయమ్మ ను వైసిపి నేతలు ప్రశ్నిస్తున్నారు.