ఈ రోజుల్లో చాలామంది నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ఇతరుల ప్రాణాలను తీసేస్తున్నారు.అన్యంపుణ్యం ఎరుగని, ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న పిల్లల ప్రాణాలను తమ వాహనాల కింద చిదిమేస్తున్నారు.
తాజాగా ఇలాంటి ఓ హృదయ విదారకమైన ఇన్సిడెంట్ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ సిటీలో చోటుచేసుకుంది.ఈ నగరంలోని జై భవాని నగర్‌లోని ఎయిర్‌డ్రోమ్ పోలీస్ స్టేషన్ సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన ఓ విషాద సంఘటన నగరాన్ని కలచివేసింది.
తమ ఇళ్ల ముందు దీపావళి పండుగ కోసం ముగ్గులు వేస్తున్న ఇద్దరు ఆడపిల్లలపైకి ఒక కారు దూసుకెళ్లింది.ఈ ఘటనలో కారు ఆగకుండా దూసుకెళ్లి పక్కనే ఉన్న ఒక దుకాణాన్ని కూడా బలంగా ఢీకొట్టింది.
సీసీ కెమెరాలో ఈ ఘటన మొత్తం రికార్డయింది.కారు డ్రైవర్ అతివేగంతో వస్తున్న కారణంగా ఈ ప్రమాదం జరిగిందని వీడియోలో స్పష్టంగా తెలుస్తుంది.దీపావళి పండుగ వేళ ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అందరూ జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.ఈ సంఘటనకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అయింది ఇందులో ఇద్దరు బాలికలు తమ ఇంటి ముందు కూర్చొని ముగ్గులు వేయడం చూడవచ్చు అంతలోనే వేగంగా వచ్చిన కారు వారిద్దరిని తొక్కేస్తూ ముందుకు వెళ్ళింది.
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలికలను స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు.వారిలో ప్రియాంశి (21) అనే బాలిక విషమంగా ఉంది.ఈ ఘటనకు ఆగ్రహించిన స్థానికులు కారును ధ్వంసం చేశారు.కారులో మద్యం సీసాలు లభించాయి.ప్రమాదం జరిపిన తర్వాత డ్రైవర్ పరారయ్యాడు.పోలీసులు విచారణ చేపట్టి, డ్రైవర్‌ను అరెస్టు చేశారు.
అతను అతి చిన్న వయస్సులో ఉన్నట్లు తెలుస్తోంది.ఈ ఘటనపై హత్య కింద కేసు నమోదు చేశారు.
బాధితుల పేర్లు ప్రియాంశి (పవన్ ప్రజాపతి కుమార్తె), నవ్య (ఆనంద్ ప్రజాపతి కుమార్తె).అదనపు డీసీపీ అలోక్ కుమార్ శర్మ ఈ విషయాన్ని ధృవీకరించారు.