ఓరి నాయనో.. రూ.52 కోట్లకు అమ్ముడుపోయిన అరటిపండు..

ప్రపంచవ్యాప్తంగా ఎన్నో వేలం పాటలు జరుగుతుంటాయి.వీటిలో పెద్దగా విలువ లేని వస్తువులు కూడా కొన్ని కోట్లకు అమ్ముడుపోతూ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంటాయి.అయితే తాజాగా ఒక అరటిపండు( Banana ) ఏకంగా రూ.50 కోట్లకు పైగా పలికి అందర్నీ నోరేళ్లపెట్టేలా చేసింది.వివరాల్లోకి వెళ్తే న్యూయార్క్‌లోని( New York ) సోథెబైస్ అనే ప్రముఖ కళా వస్తువుల వేలం ఏర్పాటులో అరటిపండు కూడా ఎంట్రీ ఇచ్చింది.ఈ అరటిపండును ఓ గోడకు టేప్‌తో అతికించి అదే ఒక గొప్ప కళాఖండం అని ఆర్టిస్ట్ చెప్పాడు.అతను వేళాకోళం చేస్తున్నాడేమో దాన్ని ఎవడు కొంటారు అని ముందు ఆక్షన్ నిర్వాహకులు అనుకున్నారు కానీ అది ఏకంగా 52.4 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది.

 A Duct-taped Banana That Fetched Over 52crores At New York Art Auction Details,-TeluguStop.com

ఈ విచిత్రమైన కళాఖండాన్ని ప్రముఖ కళాకారుడు మౌరిజియో కాటెలాన్( Maurizio Cattelan ) తయారు చేశారు.దీనికి ‘కమెడియన్’( Comedian ) అని పేరు పెట్టారు.క్రిప్టోకరెన్సీ రంగంలో ప్రముఖుడైన జస్టిన్ సన్( Justin Sun ) ఈ కళాఖండాన్ని కొనుగోలు చేసిన వ్యక్తి.ఈ వేలంలో ఆరుగురు వేలం పాటలు పాడినప్పటికీ, జస్టిన్ సన్‌ ఒక్కడే ఈ విచిత్రమైన కళాఖండాన్ని తన సొంతం చేసుకున్నారు.

Telugu Banana, Art, Banana Art, Cryptocurrency, Justin Sun, York, York Art, Soth

జస్టిన్ సన్ ఆ బననా ఆర్ట్‌ను తాను ఎందుకు కొన్నారో చెప్పారు.ఆయన అభిప్రాయం ప్రకారం, ఈ కళాఖండం కళ, ఇంటర్నెట్ మీమ్‌లు, క్రిప్టోకరెన్సీ సంస్కృతి మిశ్రమంలా ఉంది.ఆయనకు ఈ కళాఖండం అంటే, డిజిటల్ ట్రెండ్‌లు, ఆధునిక కళ మధ్య ఉన్న విచిత్రమైన సంబంధాన్ని సూచిస్తుంది.ఈ కళాఖండాన్ని తయారు చేసిన మౌరిజియో కాటెలాన్ అనే కళాకారుడు వివాదాస్పదమైన, అసాధారణమైన కళాఖండాలకు ప్రసిద్ది.

ఈ అరటిపండు కళాఖండం కూడా అలాంటిదే.

Telugu Banana, Art, Banana Art, Cryptocurrency, Justin Sun, York, York Art, Soth

ఈ కళాఖండం మొదట 2019లో ప్రదర్శనకు వచ్చింది.అప్పటి నుంచి ఇది చాలా చర్చకు దారితీసింది.కొంతమంది దీన్ని ఒక జోక్‌గా భావిస్తే, మరికొందరు ఇది నేటి సమాజంలో కళకు ఉన్న విలువ గురించి ఒక ప్రకటన అని భావిస్తారు.

కళాఖండం అమ్ముడుపోయిన విషయం కళా రంగంలో మీమ్‌లు, డిజిటల్ సంస్కృతి, టెక్నాలజీ ద్వారా సంపాదించిన సంపద ఎంత ప్రభావం చూపుతుందో చూపిస్తోంది.

ఈ రికార్డు స్థాయిలో అమ్ముడుపోవడంతో కళ నిజమైన విలువ గురించి చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఈ కళాఖండం లాంటివి సృజనాత్మకతను ప్రతిబింబిస్తాయా లేదా ప్రజలు ఎంత డబ్బు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారో చూపించడానికి ఒక ప్రయోగమా అని చాలామంది ఆలోచిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube