పైలెట్ అయిన పనిమనిషి కొడుకు.. ఆమె బ్యూటిఫుల్ రియాక్షన్ వైరల్..

తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు కోసం పగలు, రాత్రి తేడా లేకుండా ఎంతో కష్టపడుతుంటారు.వచ్చిన డబ్బునంతా వారి చదువు, అభివృద్ధి కోసమే ఖర్చు చేస్తారు.

 From Maid To Proud Mother Woman Tears Up Watching Son Become A Pilot Viral Video-TeluguStop.com

వారి కృషికి ప్రతిఫలంగా పిల్లలు పెద్ద ఉద్యోగాలు సాధిస్తుంటారు.రీసెంట్‌గా ఒక పనిమనిషి కుమారుడు( Maid’s Son ) ఏకంగా పైలెట్( Pilot ) అయ్యాడు.

ఆమె తన కొడుకుకు మెరుగైన జీవితాన్ని అందించాలని 30 ఏళ్లపాటు ఇళ్లలో పాచి పనులు చేసింది.అయితే కుమారుడు పెద్ద విమానాలు నడిపే పైలెట్ అయ్యాడు అని తెలుసుకున్న ఆమె బాగా ఎమోషనల్ అయింది.

సోషల్ మీడియాలో వారి ఎమోషనల్ వీడియో వైరల్‌గా( Viral Video ) మారింది.కష్టపడి సంపాదించిన డబ్బుతో కొడుకును పైలెట్‌గా చేయాలనే ఆ తల్లి కల నిజమైంది.

ఈ వీడియోను @Brink_Thinker అనే ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.ఈ వీడియో మొదట హార్ట్‌వార్మింగ్ స్టోరీస్ అనే ఖాతాలో పోస్ట్ చేశారు.ఈ అకౌంట్ ఎప్పుడూ ఇలాంటి స్ఫూర్తిదాయకమైన కథలను పంచుకుంటూ ఉంటుంది.ప్రస్తుత వైరల్ వీడియోలో తాను ఎక్కబోయే విమానాన్ని( Flight ) తన కొడుకే నడుపుతున్నాడని తెలియక, విమానం ఎక్కిన తల్లి( Mother ) ఆనందంతో కంటితడి పెట్టుకోవడం చూడవచ్చు.

తన కొడుకును పైలెట్‌గా చేయాలనే కల కోసం తాను చేసిన ఎన్నో త్యాగాలు ఆమెకు గుర్తుకొచ్చి ఉంటాయి అందుకే ఇంత ఎమోషనల్ అయ్యింది.ఈ క్షణం ఎంతో ఆనందాన్నిచ్చింది.

ఈ అమ్మ తన కుమారుడిని చాలా ఆప్యాయంగా ముద్దాడింది ఆ క్షణాలు చూస్తుంటే మనసు కరిగిపోతుంది.

విమానం ఎగరడం మొదలైన తర్వాత, తన కొడుకు ఆమెకు పూలగుచ్ఛం ఇచ్చాడు.ఈ మధురమైన క్షణం ఆ తల్లిని మరింత ఆనందంలో ముంచెత్తింది.సదరు పైలెట్ తన తల్లి లగేజ్ నువ్వు చాలా జాగ్రత్తగా విమానంలో పెట్టాడు అలా ఈ వీడియో ముగిసింది.

ఇది ఒక ఫారిన్ కంట్రీ నుంచి వచ్చిన వీడియోగా తెలుస్తోంది.ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా చర్చకు దారి తీసింది.పేరెంట్స్ పిల్లల సక్సెస్ కోసం ఎంత త్యాగం చేస్తారో మాటల్లో చెప్పలేము అని చాలామంది అంటున్నారు ఎన్ని సవాళ్లు ఎదురైనా, జీవితం అంతా కష్టాల్లోనే గడిచిపోయినా ఈ తల్లి తన కొడుకు కోసం నిస్వార్థంగా ఉంది అని చాలామంది అంటున్నారు.ఈ హార్ట్ టచింగ్ వీడియోను మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube