పుదీనా.చవక ధరకు లభించే అద్భుతమైన ఆకుకూర.పుదీనాను చాలా మంది వంటల్లో విరి విరిగా ఉపయోగిస్తుంటారు.వంటలకు చక్కటి రుచి, సువాసన అందించే పుదీనా.ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ఎన్నో జబ్బులను నివారిస్తుంది.
అలాగే సౌందర్య పరంగా కూడా పుదీనాను వివిధ రకాలుగా యూస్ చేస్తుంటాయి.అయితే ముఖ్యంగా పుదీనాతో ఇప్పుడు చెప్పబోయే విధంగా హెయిర్ మాస్క్ వేసుకుంటే.
మస్తు బెనిఫిట్స్ పొందొచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం పుదీనా హెయిర్ మాస్క్ ఎలా వేసుకోవాలో చూసేయండి.
ముందుగా ఒక కప్పు పుదీనా ఆకులను తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.అలాగే రెండు లేదా మూడు ఉసిరి కాయలను తీసుకుని గింజ తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఇక ఒక కలబంద ఆకులను తీసుకుని వాటర్‌తో కడిగి తొక్కతో పాటే ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఇప్పుడు మిక్సీ జార్‌లో పుదీనా ఆకులు, కట్ చేసి పెట్టుకున్న ఉసిరి కాయ, కలబంద ముక్కలు వేసి మెత్తటి పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి.

ఆ తర్వాత ఈ మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ పెరుగు, వన్ టేబుల్ స్పూన్ నిమ్మ రసం మరియు రెండు టేబుల్ స్పూన్ల కొకనట్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఆపై ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి.షవర్ క్యాప్ పెట్టేసుకోవాలి.రెండు గంటల అనంతరం కెమికల్స్ తక్కువగా ఉండే షాంపూను యూస్ చేసి తల స్నానం చేయాలి.