మెగా స్టార్ చిరంజీవి హీరోగా చరణ్ కీలక పాత్రలో నటించిన ఆచార్య విడుదల అయ్యి డిజాస్టర్ టాక్ ను దక్కించుకున్న విషయం తెల్సిందే.సినిమా మరీ ఇంత దారుణంగా ఉంటుందని తాము బావించలేదని యూనిట్ సభ్యులు కూడా స్వయంగా కామెంట్స్ చేస్తున్నారు.
సినిమాలోని ప్రతి ఎలిమెంట్ ను కూడా నెటిజన్స్ ఓ రేంజ్ లో ఏకి పారేస్తున్నారు.ముఖ్యంగా వీఎఫ్‌ఎక్స్ వర్క్ పట్ల విమర్శలు ఆగడం లేదు.
వీఎఫ్ఎక్స్ లో భాగంగా యంగ్ చిరంజీవిని తయారు చేసిన తీరుకు ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు.ఇంకా కూడా చాలా మంది ఆ షాక్ నుండి బయట పడలేక పోతున్నారు.
బాబోయ్ బాస్ ను ఇలా చూపించారు ఏంటీ అంటూ ప్రతి ఒక్కరు అవాక్కు అవుతున్నారు.మొదట ఆ లుక్ ను గెటప్ అని. జూనియర్ ఆర్టిస్టుకు ఆ గెటప్ వేసి ఉంటారు అనుకున్నారు.కాని అది గ్రాఫిక్స్ అని తెలిసి ప్రతి ఒక్కరు కూడా నోరు వెళ్లబెడుతున్నారు.
అసలు ఇలాంటి గ్రాఫిక్స్ వర్క్ కూడా ఉంటుందా అంటూ అంతా కూడా ముక్కున వేలేసుకుంటున్నారు.అసలు ఇలాంటి ఒక గ్రాఫిక్స్ కు చిరంజీవి ఎలా ఓకే చెప్పాడు అంటున్నారు.
మోహన్ బాబు సన్నాఫ్ ఇండియా సినిమా లోని గ్రాఫిక్స్ సన్నివేశాలకు కోటి రూపాయలను ఖర్చు చేశాం అన్నాడు.మరి ఈ సినిమాలోని సన్నివేశాలకు కూడా అంతే ఖర్చు చేశారా అంటూ చాలా మంది ప్రశ్నిస్తున్నారు.
అసలు ఇలాంటి గ్రాఫిక్స్ సన్నాఫ్ ఇండియా గ్రాఫిక్స్ ను కూడా డామినేట్ చేసినట్లుగా ఉన్నాయంటూ విమర్శలు వస్తున్నాయి.కొరటాల శివకు గ్రాఫిక్స్ విషయంలో ఉన్న పట్టు ఏంటో దీంతో అర్థం అయ్యిందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
గ్రాఫిక్స్ వర్క్ విషయంలో మళ్లీ ఎవరు ఇలాంటి ఒక ప్రయోగం చేయకుండా ఆచార్య చాలా పెద్ద గుణపాఠం అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.చరణ్ పాత్ర విషయంలో కూడా ఇలాంటి ప్రయోగాలు చేసి నిరాశ పర్చారు.







