జయమ్మ కొత్త ట్రైలర్‌.. సినిమాపై మరింత అంచనాలు పెంచేసింది

సుమ ప్రథాన పాత్ర లో తెరకెక్కిన జయమ్మ పంచాయితీ విడుదలకు సిద్దం అయ్యింది.

ఈనెల 6వ తారీకున విడుదల కాబోతున్న జయమ్మ పంచాయితీ నుండి మరో ట్రైలర్ ను విడుదల చేయడం జరిగింది.

మొదటి ట్రైలర్ ను పవన్ కళ్యాణ్ తో విడుదల చేయించారు.ఆయన సినిమా విడుదల సందర్బంగా తన శుభాకాంక్షలు తెలియజేశాడు.

మహేష్ బాబు తాజాగా రెండవ ట్రైలర్‌ ను విడుదల చేశాడు.సినిమా రిలీజ్ ట్రైలర్ అంటూ జయమ్మ రెండవ ట్రైలర్ ను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.

మహేష్‌ బాబు రిలీజ్ చేయడం వల్ల భారీ వ్యూస్ ను ఈ ట్రైలర్‌ దక్కించుకుంది.ఇప్పటికే సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి.

Advertisement

ఆ అంచనాలు మరింత పెరిగేలా మహేష్ బాబు విడుదల చేసిన జయమ్మ పంచాయితీ రెండవ ట్రైలర్‌ ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.జయమ్మ గా సుమ కనబర్చిన నటన అద్బుతంగా ఉందంటూ ప్రతి ఒక్కరు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

భారీ ఎత్తున సినిమా ను తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయబోతున్నారు.కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా పక్క రాష్ట్రంలో మరియు అమెరికాలో కూడా సినిమా ను విడుదల చేయబోతున్నారు.

తెలుగు వారు ఎక్కడ ఉన్నా కూడా సుమ వారందరికి కూడా సుపరిచితురాలు.అందుకే జయమ్మ పంచాయితీని అక్కడ ఇక్కడ అని కాకుండా స్టార్‌ హీరోల సినిమాలు విడుదల అయ్యే ప్రతి చోట కూడా విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటన వచ్చింది.

రికార్డు స్థాయిలో ఈ సినిమా కు బిజినెస్ అయ్యింది.కొత్త ట్రైలర్ విడుదల తర్వాత సినిమా అడ్వాన్స్ బుకింగ్‌ రెట్టింపు అయ్యాయి.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

ఇంతకు జయమ్మ పెట్టిన ఆ పంచాయితీ ఏంటో అర్థం కాక ప్రతి ఒక్కరు కూడా జుట్టు పీక్కుంటున్నారు.సినిమా సక్సెస్‌ అయితే ఖచ్చితంగా భారీ వసూళ్లు ఈ సినిమా కు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కామెంట్స్ వస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు