మొటిమలు లేదా పింపుల్స్ .ఎంతగా ఇబ్బంది పెడతాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
యుక్త వయసులో మొటిమలు రావడం సర్వ సాధారణ విషయం.కానీ, కొందరు వయసుతో సంబంధం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు మొటిమలు వస్తుంటాయి.
మొటిమలు ఉన్న వారు ఎంత అందంగా ఉన్నా.అందహీనంగానే కనిపిస్తుంటారు.
అందుకే మొటిమలు రాగానే తెగ హైరానా పడిపోతుంటారు.ముఖ్యంగా ఆడవారు ఈ మొటిమల సమస్య నుంచి బయట పడేందుకు నానా ప్రయత్నాలు చేస్తుంది.
మార్కెట్‌లో లభ్యమయ్యే క్రీములతో ఏవేవో ప్రయోగాలు చేస్తుంటారు.కానీ, సహజంగా కూడా మొటిమల సమస్యను నివారించుకోవచ్చు.
అయితే మునగాకు మొటిమల సమస్యను దూరం చేయడంలో అద్భుతంగా సహాయపడుతుంది.సాధారణంగా మునగాకులు మన భారతీయులు వంటల్లో తరచూ వాడుతూనే ఉంటారు.
ఏ ఆకుకూరల్లోనూ ఉండనన్ని విటమిన్లు మునగాకులో ఉంటాయి.ముఖ్యంగా కాల్షియం, ఐరన్, పాస్పరస్, మెగ్నీషియం, ఫైబర్, అమైనో యాసిడ్ విటమిన్ సి, విటమిన్ ఎ ఇలా ఎన్నో పోషకాలు మునగాకులో ఉంటాయి.

ఇవి మన ఆరోగ్యానికి అనేక విధాలుగా సహాయపడతాయి.అయితే ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడే మునగాకు.చర్మానికి కూడా ఉపయోగపడుతుందని చాలా మందికి తెలియదు.నిజానికి మునగాకు మొటిమలను తగ్గించడంతో పాటు చర్మాన్ని కాంతివంతంగా కూడా చేయగలదు.అదెలో ఇప్పుడు తెలుసుకుందాం.మొటిమలతో ఇబ్బంది పడుతున్న వారు.
మునగాకుల నుంచి రసం తీసుకుని అందులో నిమ్మరసం కలిపుకోవాలి.

ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని మొటిమలు మరియు నల్ల మచ్చలు ఉన్న చోటు అప్లై చేసి బాగా ఆరిపోనివ్వాలి.అనంతరం ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.ఇలా తరచూ చేస్తే మొటిమలతో పాటు నల్ల మచ్చలు కూడా క్రమంగా తగ్గిపోతాయి.
అలాగే మునగాకులను ఎండబెట్టి పొడి చేసుకోవాలి.ఆ పొడిలో కొద్దిగా తేనె కలిపి ముఖానికి అప్లై చేసి.
ఒక పది నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఇలా వారినికి రెండు సార్లు చేస్తే.
ముఖం యవ్వనంగా, కాంతివంతంగా మారుతుంది.