చలికాలంలో నువ్వులను ఖాళీ కడుపుతో ఇలా తీసుకుంటే ఊహించని ఆరోగ్య లాభాలు మీ సొంతం!

నువ్వులు. వీటి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు.

 Consuming Sesame Seeds On An Empty Stomach Will Give You More Health Benefits De-TeluguStop.com

పరిమాణంలో చిన్నగా ఉన్న నువ్వుల్లో ఎన్నో విలువైన పోషకాలు నిండి ఉంటాయి.అందుకే ఆరోగ్యపరంగా నువ్వులు అనేక ప్రయోజనాలను చేకూరుస్తాయి.

ముఖ్యంగా ప్రస్తుత చలికాలంలో నువ్వులను ఖాళీ కడుపుతో ఇప్పుడు చెప్పబోయే విధంగా తీసుకుంటే ఊహించని ఆరోగ్య లాభాలు మీ సొంతమవుతాయి.మరి ఇంకెందుకు ఆలస్యం నువ్వుల‌ను ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక బౌల్‌ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు నువ్వులను వేసుకోవాలి.ఈ నువ్వులను వాటర్ తో ఒకటికి రెండుసార్లు కడగాలి.ఆ తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.మరుసటి రోజు నానబెట్టుకున్న నువ్వులను వాటర్ తో సహా మిక్సీ జార్ లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్‌ చేసుకున్న నువ్వుల జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ బెల్లం తురుము కలిపి నేరుగా సేవించాలి.

ప్రస్తుత చలికాలంలో ప్రతిరోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతోనువ్వుల జ్యూస్ ను తీసుకుంటే కొన్ని రకాల క్యాన్సర్లు, గుండె జ‌బ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.మధుమేహం బారిన పడకుండా ఉంటారు.అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారికి ఈ నువ్వుల జ్యూస్‌ ఎంతో అద్భుతంగా సహాయపడుతుంది.

రోజు ఖాళీ కడుపుతో పైన చెప్పిన విధంగా నువ్వులు తీసుకుంటే క్యాలరీలు చాలా త్వరగా కరుగుతాయి.దాంతో వేగంగా బరువు తగ్గుతారు.

అంతేకాదు పైన చెప్పిన విధంగా నువ్వుల జ్యూస్‌ను తయారు చేసుకుని తాగితే రక్తహీనత సమస్య దూరం అవుతుంది.జీర్ణ వ్యవస్థ చురుగ్గా మారుతుంది.గ్యాస్, మలబద్ధకం, ఎసిడిటీ వంటి సమస్యలు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.మెదడు చురుగ్గా పనిచేస్తుంది.ఇక నువ్వుల్లో మెగ్నీషియం దండిగా ఉంటుంది.ఇది అధిక రక్తపోటును అదుపులోకి తేవడానికి అద్భుతంగా సహాయపడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube