నేపాల్ లోని పోఖారా ఎయిర్ పోర్ట్ దగ్గర కుప్పకూలిన యాతి విమాన ప్రమాదంలో మృతి చెందిన వారిలో దాదాపు 68 మంది మృతదేహాలను కనుగొన్నారు.ఖాట్మండు నుంచి సుమారు 72 మందితో పోఖారా వెళ్తున్న ఈ విమానం ఇక్కడ రన్వే వద్ద ల్యాండింగ్ సమయంలో కుప్పకూలిపోయింది.
మృతులలో ఐదుగురు భారతీయులు ఉన్నట్లు సమాచారం.ఇంకా 53 మంది నేపాలీలు, నలుగురు రష్యన్లు, ఒక ఐరిష్, ఇద్దరు కొరియన్లు, ఇద్దరు పిల్లలు, అర్జెంటీనా, ఫ్యాన్స్ కు చెందిన ఒక్కొక్కరు చొప్పున ఈ ఘోర దుర్ఘటనలో మృతి చెందినట్లు భావిస్తున్నామని ఎయిర్ పోర్ట్ అథారిటీకి చెందిన ఒక అధికార ప్రతినిధి వెల్లడించారు.
ఘటన జరిగిన ప్రాంతం వద్ద పెద్ద ఎత్తున మంటలు రేగి నల్లని పొగలు వస్తున్న కారణంగా సహాయక చర్యలు నిర్వహించడం కష్టతరంగా ఉందని ఆయన వెల్లడించారు.విమానా శిధిలాల క్రింద ఇంకా మృతదేహాలు ఉండవచ్చునని ఆయన భావిస్తున్నారు.
ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే నేపాల్ ప్రధాని పుష్ప కమల్ ప్రచండ అత్యవసర క్యాబినెట్ సమావేశాన్ని నిర్వహించారు.పొఖరా విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసి వేయడం జరిగింది.

యతి ఎయిర్ లైన్స్ విమానం టేక్ ఆఫ్ అయినా సుమారు 20 నిమిషాలకే కుప్పకూలినట్లు సమాచారం.ఈ ప్రమాదానికి కారణం ఇప్పుడే చెప్పలేమని విమానాశ్రయ అధికారులు చెబుతున్నారు.ఈ ఘటనపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతి ఆదిత్య సిద్ధియా ద్రుగ్భాంతి వ్యక్తం చేశారు.ప్రమాద మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపం ప్రకటించారు.

ఇంకా చెప్పాలంటే నిజానికి నేపాల్ లో విమానా ప్రయాణాల పట్ల సేఫ్టీ పట్ల యూరోపియన్ యూనియన్ గతంలో ఆందోళన వ్యక్తం చేసింది.అక్కడి విమానా సిబ్బందికి తగినంత శిక్షణ లేదని పేర్కొంటూ 2013లోనే ఫ్లైట్ సేఫ్టీని బ్లాక్ లిస్టులో పెట్టింది.నేపాల్ నుంచి వచ్చే అన్ని విమానాలు తమ గగనతల పరిధిలోకి రాకుండా నిషేధం విధించింది.నేపాల్ లో జరిగిన విమాన ప్రమాదాలలో వందలది మంది మరణించారు.పోయిన సంవత్సరం మే 22 నేపాలి క్యారియర్ టాటా ఎయిర్ లైన్స్ వారి విమానం కూలిపోయినప్పుడు నలుగురు భారతీయులతో పాటు 16 మంది నేపాలీలు కూడా మరణించారు.