ఒక ఉద్యోగం నుంచి వైదొలుగుతున్నప్పుడు కంపెనీ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో అనే భయం చాలామందికి ఉంటుంది.కానీ సిమ్రాన్( Simran ) అనే మహిళా ఉద్యోగినికి మాత్రం తన మేనేజర్( Manager ) నుంచి చాలా సానుకూల స్పందన లభించింది.
తను ఉద్యోగం మారుస్తున్నట్లు తన మేనేజర్‌కు చెప్పినప్పుడు మేనేజర్ చాలా కూల్ గా రియాక్ట్ అయ్యారు.సిమ్రాన్ నా రాజీనామా( Resignation ) ప్రకటించేటప్పుడు ఒక వీడియో రికార్డ్ చేసుకుంది.
ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఆ వీడియోలో సిమ్రాన్ తన లేడీ మేనేజర్‌తో, “నాకు కొత్త ఉద్యోగం( New Job ) వచ్చింది.శుక్రవారం నా చివరి రోజు, ఆరోజు తర్వాత మీ కంపెనీలో ఇక నేను పని చేయను.” అని నర్వస్‌గా చెప్పింది.
దీనికి సిమ్రాన్ మేనేజర్ చాలా ఫ్రెండ్లీగా రియాక్టయ్యారు.“కంగ్రాట్యులేషన్స్.నాకు చాలా ఆనందంగా ఉంది.ఐ యామ్ హ్యాపీ ఫర్ యు. నాకు బాధే ఉంది కానీ, పర్లేదు, డార్లింగ్” అని చెప్పారు.సిమ్రాన్‌ను కంపెనీలోనే ఉండమని లేదా నోటీసు పీరియడ్ పెంచమని అడగకుండా ఆమెను అభినందించడం విశేషం.
తన మేనేజర్ అద్భుతమైన ప్రతిస్పందనకు సిమ్రాన్ కన్నీళ్లు పెట్టుకుంది.తరువాత, ఆమె తన మేనేజర్‌పై ఉన్న కృతజ్ఞతను వ్యక్తపరుస్తూ ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.“ఈ మహిళ ఎంత అద్భుతమో మీకు చూపించాలని నేను కోరుకున్నాను.ఒక మంచి మేనేజర్ కంపెనీలో ఉండటం ఎంత ముఖ్యమో ఆమె నాకు నేర్పించింది” అని సిమ్రాన్ రాసింది.
సోషల్ మీడియా యూజర్లు ఆ వీడియోను విశేషంగా అభినందించారు.చాలామంది సిమ్రాన్ మేనేజర్‌ను అత్యంత పాజిటివ్, హెల్ప్‌ఫుల్ మేనేజర్ అని అభివర్ణించారు.“ఎంత అద్భుతమైన బాస్! ఆమె తన ఉద్యోగిని ధైర్యపరిచి, ఆమెను సౌకర్యంగా ఉండేలా చేసింది” అని ఒక నెటిజన్ రాశారు.మరొకరు, “ఒక గ్రీన్ ఫ్లాగ్ మేనేజర్‌కు( Green Flag Manager ) నిజమైన ఉదాహరణ!” అని అన్నారు.