తెల్ల జుట్టు రావడం ప్రారంభమైందా? అయితే వెంటనే ఇలా చేయండి!

వయసు పైబడే కొద్దీ జుట్టు తెల్ల పడటం సర్వసాధారణం.కానీ ఇటీవల రోజుల్లో చాలా మంది ముప్పై ఏళ్లకే తెల్ల జుట్టు సమస్యను ఫేస్ చేస్తున్నారు.

 This Home Remedy Helps To Stop White Hair Details! Home Remedy, Stop White Hair,-TeluguStop.com

జుట్టు త్వరగా తెల్లబడటానికి ఎన్నో కారణాలు ఉన్నాయి.ముఖ్యంగా ఒత్తిడి, కాలుష్యం, ధూమపానం, మద్యపానం, ఆహారపు అలవాట్లు వంటి అంశాలు తెల్ల జుట్టు రావడానికి ప్రధాన కారణాలు.

ఏదేమైనప్పటికీ తెల్ల జుట్టు వృద్ధాప్యానికి సంకేతం.అందుకే తెల్ల జుట్టు రావడం ప్రారంభమైందంటే చాలు తెగ హైరానా పడిపోతుంటారు.

కానీ ఇక‌పై టెన్షన్ వద్దు.తెల్ల జుట్టు రావడం స్టార్ట్ అయింది అంటే వెంటనే ఇప్పుడు చెప్పబోయే రెమెడీని పాటించండి.ఈ రెమెడీ తెల్ల జుట్టుకు అడ్డుకట్ట వేయడంలో అద్భుతంగా సహాయపడుతుంది.ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు హెన్నా పౌడర్, వన్ టేబుల్ స్పూన్ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్, రెండు టేబుల్ స్పూన్లు మందారం పౌడర్ వేసుకోవాలి.

చివరిగా సరిపడా వాటర్ ను వేసి బాగా మిక్స్ చేయాలి.

ఇలా మిక్స్ చేసిన మిశ్రమాన్ని నైట్ అంతా వదిలేయాలి.

మ‌రుస‌టి రోజు ఉదయాన్నే తయారు చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి ష‌వ‌ర్ క్యాప్ ధ‌రించాలి.గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తలస్నానం చేయాలి.

వారంలో ఒక్కసారి ఈ విధంగా చేస్తే హెన్నా పౌడర్, కాఫీ పౌడర్ మరియు మందారం పౌడర్ లో ఉండే ప్రత్యేక సుగుణాలు జుట్టు తెల్లబడటాన్ని ఆదిలోనే అడ్డుకుంటాయి.

అలాగే తెల్ల బడిన జుట్టును క్రమంగా నల్లగా మారుస్తాయి.తెల్ల జుట్టుకు దూరంగా ఉండాలి అనుకునే వారికి ఈ రెమెడీ అద్భుతంగా సహాయపడుతుంది.పైగా ఈ రెమెడీని పాటించడం వల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది.ఆయిలీ హెయిర్ నుంచి సైతం విముక్తి లభిస్తుంది.

Best Home Remedies for Grey Hair

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube