మజ్జిగ..
( Buttermilk ) నిత్యం ఒక గ్లాస్ తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు.చాలా మందికి లంచ్ లేదా డిన్నర్ తర్వాత మజ్జిగ తాగే అలవాటు ఉంటుంది.
అయితే ఆరోగ్యానికి మాత్రమే కాదు జుట్టు సంరక్షణకు కూడా మజ్జిగ ఎంతో బాగా సహాయపడుతుంది.ముఖ్యంగా మజ్జిగతో జుట్టును కడిగితే బోలెడు లాభాలు మీ సొంతం అవుతాయి.
అందుకోసం ముందుగా ఒక గ్లాసు మజ్జిగ ను తీసుకోండి.ఈ మజ్జిగ లో రెండు టేబుల్ స్పూన్లు నిమ్మరసం వేసి బాగా కలపండి.
ఇప్పుడు ఈ మజ్జిగను తల, జుట్టు మొత్తం తడిసేలా పోసుకుని కాసేపు మసాజ్ చేసుకోండి.అరగంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి హెయిర్ వాష్ చేసుకోండి.
వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఈ విధంగా మజ్జిగతో జుట్టును కడగడం వల్ల చాలా ప్రయోజనాలు పొందుతారు.మజ్జిగ లో ఉండే ప్రోటీన్, కొవ్వులు, లాక్టిక్ ఆమ్లం స్కాల్ప్ ను లోతుగా శుభ్రం చేస్తుంది.
తలపై పేరుకుపోయిన మృత కణాలు తొలగిస్తుంది.

చుండ్రు( Dandruff )ను మాయం చేస్తుంది.మజ్జిగ లో ఉండే ప్రోటీన్ జుట్టు కుదుళ్లను బలంగా శక్తి వంతంగా మారుస్తుంది.దీంతో హెయిర్ ఫాల్ సమస్య( Hair fall problem ) కంట్రోల్ అవుతుంది.
అలాగే మజ్జిగతో జుట్టును కడగడం వల్ల హెయిర్ గ్రోత్ అనేది ఇంప్రూవ్ అవుతుంది.ఫలితంగా మీ జుట్టు కొద్ది రోజుల్లోనే ఒత్తుగా పొడుగ్గా మారుతుంది.

ఇక చాలామంది తమ జుట్టు తరచూ చిట్లిపోతుందని తెగ వర్రీ అయిపోతుంటారు.అయితే ఈ సమస్యకు చెక్ పెట్టడానికి కూడా మజ్జిగ అద్భుతంగా హెల్ప్ చేస్తుంది.వారంలో ఒకటి లేదా రెండు సార్లు మజ్జిగతో జుట్టును కడిగితే..చిట్లడం, విరగడం వంటివి క్రమంగా తగ్గుముఖం పడతాయి.కాబట్టి ఇకపై మజ్జిగతో జుట్టును కడగడం అలవాటు చేసుకోండి.
ఫలితంగా ఆరోగ్యమైన అందమైన జుట్టు మీ సొంతం అవుతుంది.