షాజహాన్ ( Shah Jahan )అంటే ఎవరో తెలియని జనాలు వుండరు.ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్ మహల్( Taj Mahal ) గురించి తెలిసిన వారికి షాజహాన్ పేరు తప్పక తెలుస్తుంది.
భారత దేశాన్ని పరిపాలించిన మొగలాయి చక్రవర్తులలో షాజహాన్ ఒకరు.షాజహాన్ తన పరిపాలనా కాలంలో ప్రజలను బాగా చూసుకున్నప్పటికీ వ్యక్తిగత జీవితంలో చేసినటువంటి దారుణమైన తప్పులు వలన చరిత్ర హీనుడిగా పేరుగాంచాడు.
కొందరు యూరోపియన్లు మరియు ఇంగ్లాండ్ దేశస్థులు రాసినటువంటి పుస్తకాల ఆధారంగా షాజహాన్ దాదాపుగా 7 మందిని పెళ్లి చేసుకున్నాడని, ఇందులో తన నాలుగవ భార్య ముంతాజ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అని ప్రతీతి.

అయితే, ముంతాజ్ కి అప్పుడే తన కుటుంబ సభ్యులు వేరే వ్యక్తితో పెళ్లి చేయడంతో అతడిని షాజహాన్ చంపేసి మరీ ముంతాజ్ ని రెండో పెళ్లి చేసుకున్నాడని చరిత్ర చెబుతోంది.కాగా ఆమెకి 14 మంది సంతానం.ముంతాజ్ చనిపోయిన తర్వాత ఆమె చెల్లెలు పర్వార్ ఖనుమ్( Parwar Khanum ) ని షాజహాన్ వివాహం చేసుకున్నాడు.ఈ విషయం చాలామందికి తెలియదు.షాజహాన్ స్త్రీ లోలుడని దాంతో తనకు నచ్చిన అందమైన యువతులను కన్నె పిల్లలను తన విశ్రాంత మందిరంలో ఉంచుకొని వారితో సరస సల్లాపాలు సాగించేవాడని పుస్తకాలలో వ్రాయబడింది.
అంతేగాక షాజహాన్ తన మొదటి భార్యకి జన్మించిన ఇద్దరి కూతుళ్లతో కూడా అక్రమ సంబంధం పెట్టుకున్నాడని కూడా ఆరోపణలు వున్నాయి.

ఇకపోతే షాజహాన్‌కు సుగంధ ద్రవ్యాలపై ఎక్కువగా మోజు ఉండేదని కథనం వుంది.అప్పట్లో కూడా శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి, వ్యాధులతో పోరాడడంలో సహాయపడటానికి మసాలా దినుసులను వంటలలో విరివిగా వాడేవారట.ఫ్లూ లాంటి వ్యాధులతో పోరాటానికి సుగంధ ద్రవ్యాలను తగినంతగా ఉపయోగించాలని రాజ వైద్యుడు కూడా స్వయంగా షాజహాన్‌కు సూచించడంతో షాజహాన్ వాటిపైన ఎక్కువ మక్కువ పెంచుకున్నాడట.
దాంతోనే అవసరం వున్నా, లేకపోయినా తాను తీసుకునే ఆహారంలో ఎక్కువమోతాదులో మసాలాలు ఉండేలా ఆదేశాలు జారీచేసేవాడట.







