టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ( Tollywood director Puri Jagannath )గురించి మనందరికీ తెలిసిందే.డైరెక్టర్ గా మంచి మంచి సినిమాలు తెరకెక్కించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఈ మధ్యకాలంలో సినిమాలపై పెద్దగా ఆసక్తిని చూపించడం లేదు.
దానికి తోడు ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు కూడా ఆశించిన స్థాయిలో ఫలితాలను రాబట్టలేకపోతున్నాయి.ఆ సంగతి పక్కన పెడితే పూరి మ్యూజింగ్స్ అనే పేరుతో పూరి జగన్నాథ్ ఆసక్తికర విషయాలు పంచుకుంటున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే చాలా రకాల టాపిక్స్ పై పాడ్ కాస్ట్ నిర్వహించారు పూరి జగన్నాథ్.
అయితే తాజాగా బాడీ విస్పర్ ( Body Whisper )అనే విషయం గురించి కూడా వివరించారు.ఈ విషయం గురించి పూరి జగన్నాథ్ మాట్లాడుతూ.మనందరి శరీరాల్లో అంతర్లీనంగా అలారమ్ సిస్టమ్ ఉంది.
దాన్నే అంతర్ దృష్టి లేదా సిక్స్త్ సెన్స్ అంటాము.ఏదైనా జరగబోయే ముందు బాడీ మనకు వార్నింగ్ ఇస్తుంది.
చాలాసార్లు తప్పు జరిగాక మన అంతర్ దృష్టి చెప్పిందే కరెక్ట్ అని ఫీలవుతాము.ఏదైనా ప్రమాదం జరిగే ముందు పొట్ట టైట్ అవుతుంది.
దీనినే గట్ ఫీలింగ్ అని అంటారు.సెకండ్ బ్రెయిన్ ( Second brain )అనేది దానికి మరో పేరు.
గట్ ఫీలింగ్ కు, మన భావోద్వేగాలకు లింక్ ఉంటుంది.ఏదైనా డేంజర్ అని తెలిసినప్పుడు హార్ట్‌రేట్ పెరుగుతుంది.
చెమట పడుతుంది.వణికిపోతుంటాము.మన మైండ్ కూడా మనకు కొన్ని వార్నింగ్స్ ఇస్తూనే ఉంటుంది.కానీ మనం పట్టించుకోం.ఇది తప్పు చేయొద్దు అని మెదడు చెబుతున్నా ఏం కాదు అనుకుని చేసేస్తాము.మన బాడీ విస్పర్ ని కచ్చితంగా వినాలి.
ఎప్పుడైనా మనం పెద్దగా పరిచయం లేనివారిని, అపరిచితులను మీట్ అవ్వాల్సి వస్తుంది.వారు ఎక్కడికైనా రమ్మంటే వెళ్లవచ్చు.
ఒకవేళ మీరు అక్కడ ఇబ్బందిగా ఫీలైతే ఒక్క క్షణం ఉండొద్దు.జీవితంలో ఒక లక్ష్యం పెట్టుకుని దాని కోసం కష్టపడే వారికి అంతర్ దృష్టి ఎక్కువగా పనిచేస్తుందని విన్నాను అని చెప్పుకొచ్చారు పూరి జగన్నాథ్.
అందుకు సంబంధించిన వీడియోనే తన యూట్యూబ్ ఖాతాలో షేర్ చేశారు పూరి జగన్నాథ్.