కొన్ని కొన్ని విషయాల్లో మొండి పట్టుదలకు వెళ్లి విమర్శల పాలవుతున్నారు వైసీపీ అధినేత జగన్.( YCP chief Jagan ) ప్రస్తుతం జరుగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలకు జగన్ తో సహా వైసిపి ఎమ్మెల్యేలు హాజరు కావడం లేదు.
తమకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే సమావేశాలకు హాజరవుతామని జగన్ పట్టుబడ్డారు .ప్రతిపక్ష హోదా ఇచ్చేవరకు అసెంబ్లీకి వచ్చేదే లేదంటూ జగన్ భీష్ముంచుకుని కూర్చోవడం పై తీవ్ర విమర్శలు వ్యర్థమవుతున్నాయి .ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలలోనే( assembly meetings itself ) బడ్జెట్ సమావేశాలు జరుగుతుండడంతో వీటికి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది.
ప్రభుత్వ తీరును ఎండగట్టే అవకాశం వైసీపీకి ఉండేది.కానీ ఆ అవకాశం లేకుండా బడ్జెట్ , అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరు కావడం తో జగన్ మంచి అవకాశాన్ని చేజార్చుకున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి .సభలో మాట్లాడే అవకాశం ఇవ్వకపోయినా వైసిపికి మేలే జరిగేదని ప్రజల నుంచి సానుభూతి లభించేదని ,కానీ అసెంబ్లీకి రాకుండా శాసనమండలికి మాత్రమే హాజరవుతుండడంతో సానుభూతి రాకపోగా , జగన్ తీరు పైన జనాల్లోనూ పార్టీ నేతలు విమర్శలు రక్తం అవుతున్నాయనే అభిప్రాయాలు ఆ పార్టీ నాయకుల్లోనూ కనిపిస్తున్నాయి వరద సాయం మీద వైసిపి వాయిదా తీర్మానం ఇచ్చే అవకాశం ఉంది .కానీ వాయిదా తీర్మానం ఇచ్చే అవకాశాన్ని కూడా వైసిపి కోల్పోయింది .ఎన్నికలు జరిగి ఐదు నెలలు కూడా కాలేదు.ఇప్పటి నుంచే జగన్ మొండి పట్టుదలకు వెళుతూ పార్టీకి మైలేజ్ తీసుకొచ్చే విషయంలో తప్పక అడుగులు వేస్తున్నారనే అభిప్రాయాలు సర్వత్ర వ్యక్తం అవుతున్నాయి.
శాసనసభలు చర్చలు ఏకపక్షంగా కొనసాగుతున్నాయి. వైసిపి( YCP ) సభలో ఉంటే ఆ అవకాశం ఉండేది కాదు వైసిపి ఎమ్మెల్యేలు హాజరై నిరసన తెలుపుతూ వాకౌట్ చేసినా కొంత ప్రయోజనం ఉండేది.కానీ జగన్ తాను అధికారంలో ఉంటేనే అసెంబ్లీకి రావాలన్న ధోరణితో వ్యవహరిస్తుండడం ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానని చెబుతుండడం పైనే విమర్శల పాలు అవుతున్నారు ఇదే విషయాన్ని జగన్ దృష్టికి కొంత మంది పార్టీ సీనియర్లు తీసుకువెళ్ళినా పట్టించుకోలేదని, ఎన్నో కీలక అంశాల గురించి అసెంబ్లీలో చర్చకు తెరలేపే అవకాశం ఉన్నా, ఆ అవకాశాన్ని జగన్ చేజార్చుకున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
బడ్జెట్ కేటాయింపుల పైన అధికార పార్టీని నిలదీసే అవకాశాన్ని జగన్ కోల్పోయారు.జగన్ తీసుకుంటున్న ఈ తరహా నిర్ణయాలు ఆయనకు కలిసి రాకపోగా విమర్శలకు కారణం అవుతున్నాయి.