గుడ్ న్యూస్ చెప్పబోతున్న నటుడు నాగశౌర్య... తండ్రి కాబోతున్నారా?

ఊహలు గుసగుసలాడే సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీ హీరోగా పరిచయమయ్యాడు నటుడు నాగశౌర్య( Nagashaurya ).ఇలా మొదటి సినిమాతోనే తన నటన ద్వారా ప్రేక్షకులను మెప్పించిన ఈయన అనంతరం ఎన్నో కుటుంబ కథ ప్రేమ కథ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ హీరోగా ఇండస్ట్రీలో సక్సెస్ అందుకున్నారు.

 Nagashaurya Wife Anusha Shetty Pregnancy News Viral, Nagashaurya,anusha Shetty,p-TeluguStop.com

ఇక ఇటీవల కాలంలో నాగశౌర్య నటించిన సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాయి.

Telugu Anusha Shetty, Nagashaurya, Pregnancy, Tollywood-Movie

ఇక నాగశౌర్య సినీ కెరియర్ పక్కనపెట్టి వ్యక్తిగత విషయానికి వస్తే.ఈయన బెంగళూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఇంటీరియర్ డిజైనర్ అయినటువంటి అనూష శెట్టి( Anusha Shetty ) అనే అమ్మాయిని ప్రేమించి పెద్దల సమక్షంలో గత రెండు సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు.అనూష శెట్టిను నాగశౌర్య 2022 నవంబర్ 20వ తేదీ బెంగళూరులో ఘనంగా వివాహం చేసుకున్నారు.

ఇలా వివాహం తరువాత ఈయన తన వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.ఇదిలా ఉండగా తాజాగా వీరికి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Telugu Anusha Shetty, Nagashaurya, Pregnancy, Tollywood-Movie

నాగశౌర్య త్వరలోనే తండ్రి( Father ) కాబోతున్నారంటూ ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.ప్రస్తుతం అనూష శెట్టి కడుపుతో ఉన్నారని అయితే ఈ విషయాన్ని నాగశౌర్య కేవలం కుటుంబ సభ్యులకు మాత్రమే తెలియజేశారని తన ఆత్మీయులకు సన్నిహితులకు కూడా తెలియచేయలేదని సమాచారం.ప్రస్తుతం కడుపుతో ఉన్నటువంటి అనూష శెట్టి అతి త్వరలోనే బిడ్డకు జన్మనివ్వబోతున్నారని తెలుస్తోంది.ఇలా నాగశౌర్య తండ్రి కాబోతున్నారనే విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు ఈయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

మరి ఈయన తండ్రి కాబోతున్నారంటూ వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజముందనేది తెలియాల్సి ఉంది.ఇక నాగశౌర్య చివరిగా కృష్ణ బృందవిహారి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ప్రస్తుతం ఈయన పలు సినిమాలలో నటిస్తూ షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube