కూర్చున్న యువకుడిపైకి దూసుకొచ్చిన బస్సు.. చివరికి ఏమైందో చూస్తే గుండెలదురుతాయి..!

కేరళలోని ఇడుక్కి జిల్లా,( Idukki ) కట్టప్పన కొత్త బస్టాండ్‌లో సోమవారం ఒక షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది.సోమవారం సాయంత్రం కుమిలికి చెందిన విష్ణు( Vishnu ) అనే యువకుడు ఈ బస్టాండ్‌లోని ఒక బెంచ్‌పై కూర్చొని మొబైల్ చూస్తున్నాడు.

 Youth Narrowly Escapes Death After Bus Rams Into Him At Idukki Bus Depot Video V-TeluguStop.com

అదే సమయంలో ఆ బస్సు డిపోకి ఒక ప్రైవేట్ బస్సు( Private Bus ) వచ్చింది.అయితే అది అదుపు తప్పి విష్ణుకి ఎదురుగా దూసుకు వచ్చింది.

అంతేకాదు అతనిపై బస్సు బంపర్ ఎక్కేసింది.అది మున్నార్-కట్టప్పన రూట్‌లో నడుస్తున్న ‘దియామోల్’ అనే బస్సు అని తెలిసింది.

డ్రైవర్ పార్క్ చేయాలని ప్రయత్నిస్తున్న సమయంలో గేర్ ఫెయిల్యూర్‌ కారణంగా అదుపు తప్పింది.వాహనం అనుకోకుండా ముందుకు దూసుకెళ్లి విష్ణు పైకి ఒక అడుగు మందం ఎక్కేసింది.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఆ వీడియోలో యువకుడి ఛాతీ పైకి బస్సు ముందు భాగం ఎక్కడం చూడవచ్చు.తర్వాత అదృష్టవశాత్తు వెంటనే బస్సు వెనక్కి రాగలిగింది.దాంతో ఈ యువకుడు పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.

కొద్ది సెకన్లు బస్సు ముందుకు వెళ్లినట్లయితే విషాదం జరిగేది.CCTV ఫుటేజ్‌లో బస్సు విష్ణుకి ఎంత దగ్గరగా వచ్చిందో స్పష్టంగా కనిపిస్తోంది.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి చాలామందిని షాక్‌కు గురి చేసింది.

విష్ణుకు తేలికపాటి గాయాలైనప్పటికీ, అతన్ని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.డాక్టర్లు అతని ఆరోగ్యం స్థిరంగా ఉందని, కోలుకుంటున్నారని నిర్ధారించారు.ఈ ప్రమాదం వల్ల ఆ బస్సులోని లోపాలు బయటపడ్డాయి.

గేర్ ఫెయిల్యూర్‌కు కారణమేమిటో తెలుసుకోవడానికి స్థానిక అధికారులు దర్యాప్తు చేపట్టారు.భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలని అధికారులు కోరుతున్నారు.

ఫిట్‌గా లేని బస్సులను రోడ్లపై తిరిగితే ప్రజల ప్రాణాలు పోవడం ఖాయం.ప్రయాణికుల భద్రతను నిర్ధారించడానికి అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి.

ఓనర్లు, డ్రైవర్లు తమ వాహనాలను రెగ్యులర్‌గా చెకప్ చేయించాలి.అరిగిపోయిన పరికరాలు పడేసి కొత్తవి వాడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube