వైసిపి కి చెందిన కీలక నేతలు ఎంతో మంది ఇప్పటికే టిడిపి , జనసేనలలో చేరుతూ ఉండగా, మరి కొంతమంది అదే బాటలో వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.వీరిలో ఎక్కువమంది జగన్ కు( Jagan ) అత్యంత సన్నిహితులు గాను, గత వైసీపీ ప్భుత్వంలో కీలక పదవులు అనుభవించిన వారే కావడంతో ఈ చేరికల వ్యవహారం సంచలనంగా మారుతోంది.
గత వైసిపి ప్రభుత్వం లో ఉప ముఖ్యమంత్రిగా , వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ ( ఆళ్ల నాని ) నేడు టిడిపిలో చేరబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈరోజు జరిగే మంత్రివర్గ సమావేశం అనంతరం టిడిపి అధినేత చంద్రబాబును కలిసి ఆయన సమక్షంలోనే పార్టీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం.
అయితే ఇప్పటి వరకు ఆళ్ల నాని( Alla Nani ) పార్టీ మార్పు వ్యవహారంపై ఎక్కడ చర్చ జరగలేదు.
కొద్దిరోజుల క్రితమే వైసిపి ( YCP ) ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.అప్పటి నుంచి సైలెంట్ గానే ఉంటున్న నాని హైదరాబాదులో టిడిపి( TDP ) కీలక నేతలతో పార్టీలో చేరే విషయం పైనే చర్చించినట్లు సమాచారం. అయితే ఈ విషయాలు ఎక్కడా బయటకు పొక్కకుండా చాలా జాగ్రత్తగా తీసుకున్నారు.
వైసిపి ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సమయంలోనే తాను ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని నాని ప్రకటించారు.ఆ తరువాత ఆయన జనసేన లో చేరబోతున్నట్లు ప్రచారం జరిగింది.
కానీ టిడిపిలో చేరేందుకు ఆయన ఆసక్తి చూపించినట్లు సమాచారం.
ఈ మేరకు కు ఆళ్ల నానికి అత్యంత సన్నిహితులు, విజయనగరం జిల్లాకు చెందిన ఓ టిడిపి కీలక నేత సహకారంతోనే టిడిపి అధిష్టానం ను ఒప్పించి ఆ పార్టీలో చేరుతున్నట్లు సమాచారం .అయితే నాని చేరికపై ఏలూరు నియోజకవర్గ టిడిపి నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఇప్పుడు నానిని చేర్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని కొంతమంది నేతలు పార్టీ పెద్దలను ప్రశ్నిస్తున్నారట.
భవిష్యత్తు రాజకీయాలను దృష్టిలో ఉంచుకునే ఈ చేరికలను ప్రోత్సహిస్తున్నామని , టిడిపి అధిష్టానం కు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తోందట.ఇక భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్( Grandhi Srinivas ) కూడా టీడీపీ లో చేరబోతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.
ఈ విధంగా జగన్ కు అత్యంత సన్నిహితులు ఉన్న వారే ఇప్పుడు టీడీపీ , జనసేన లలో చేరుతుండడం తో అసలు వైసీపీలో ఏం జరుగుతోంది అనే సందేహాలు అందరిలోనూ వ్యక్తం అవుతున్నాయి.