స్కాటిష్ లైట్‌హౌస్‌లో దొరికిన 132 ఏళ్ల బాటిల్ మెసేజ్.. అందులో ఏం రాసుందంటే..?

ఇటీవల దక్షిణ స్కాట్లాండ్‌లోని కార్స్‌వాల్ లైట్‌హౌస్‌లో( Corsewall Lighthouse ) 132 ఏళ్ల నాటి బాటిల్‌ మెసేజ్ దొరికింది! బీబీసీ నివేదిక ప్రకారం, స్కాట్లాండ్‌లోని( Scotland ) ఒక లైట్‌హౌస్‌లో ఇంత ఓల్డ్ బాటిల్‌ మెసేజ్( Old Bottle Message ) దొరకడం ఇదే తొలిసారి.క్వీల్, ఇంకుతో రాసిన ఈ సందేశం 1892, సెప్టెంబర్ 4న నాటిది.

 Hidden Message In A Bottle Uncovered By Scottish Lighthouse Workers After 132 Ye-TeluguStop.com

లైట్‌హౌస్‌లో మోడర్న్ లైట్ సిస్టమ్‌ను ఇన్‌స్టాల్ చేసిన ముగ్గురు ఇంజనీర్ల పేర్లు, ఆ సమయంలో అక్కడ పనిచేసిన ముగ్గురు లైట్‌హౌస్ కీపర్ల పేర్లు ఈ సందేశంలో ఉన్నాయి.

ఈ బాటిల్‌ను నార్తర్న్ లైట్‌హౌస్ బోర్డ్‌కు చెందిన మెకానికల్ ఇంజనీర్ రాస్ రస్సెల్( Mechanical Engineer Ross Russell ) కనుగొన్నారు.

ఇది కప్‌బోర్డ్ ప్యానెళ్ల వెనుక, చేరుకోలేని ప్రదేశంలో దాగి ఉంది.ప్రస్తుత టీమ్ దీన్ని బయటకు తీయడానికి రోప్, బ్రూమ్ హ్యాండిల్‌ని ఉపయోగించి ఒక సాధనాన్ని తయారు చేసింది.

ఆపై బాటిల్‌ను జాగ్రత్తగా తెరిచారు! లైట్‌హౌస్‌లో పార్ట్‌టైమ్‌ కీపర్‌గా పనిచేసే బారీ మిల్లర్ రావడానికి టీమ్ వెయిట్ చేసింది.మిల్లర్ వారిని మెచ్చుకుని, ఈ ఆవిష్కరణలో సాయం చేశాడు.

ఈ బాటిల్ చాలా గరుకుగా ఉన్న గాజుతో చేయబడింది.దీని వంగిన అడుగు భాగం దీన్ని నిటారుగా నిలబడనివ్వదు.మొదట్లో నూనె కోసం ఉపయోగించిన కార్క్/బిరడా సంవత్సరాల తరువాత వ్యాకోచించి గాజుకు అతుక్కుపోయింది.దీన్ని కట్టి ఉంచిన తీగ తుప్పు పట్టి పోయింది.బృందం సభ్యులు జాగ్రత్తగా కార్క్‌ను కట్ చేసి, దానిని డ్రిల్ల్ చేసి బాటిల్‌ను తెరిచారు.ఒక ప్రత్యేక తీగతో చేసిన సాధనాన్ని ఉపయోగించి, సన్నని బాటిల్ నెక్ ద్వారా సందేశాన్ని నెమ్మదిగా బయటకు లాగారు.77 ఏళ్ల డాక్టర్ మిల్లర్ మొదటిసారిగా ఈ సందేశాన్ని తాకినప్పుడు తన ఉత్సాహాన్ని పంచుకున్నారు.

రాస్ రస్సెల్ ఈ ఆవిష్కరణను అద్భుతంగా అభివర్ణించారు.“132 సంవత్సరాల తర్వాత ఆ బాటిల్‌ను తాకడం అద్భుతమైన అనుభూతి.ఇది నిజంగా ఒకసారి జరిగే అరుదైన సంఘటన” అని ఆయన అన్నారు.

ఈ సందేశం లైట్‌హౌస్ ప్రారంభ దశల్లో ఎలా ఆపరేట్ అయిందనే దానిపై ఒక అవగాహన అందిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube