ఓరి, నాయనో.. వెయ్యి ఇళ్లల్లోకి చొరబడ్డ వ్యక్తి.. విచారణలో ఏం చెప్పాడంటే..?

ఈ రోజుల్లో జనాలు చాలా విచిత్రంగా ప్రవర్తిస్తూ ప్రజలకు హడలెత్తిస్తున్నారు.సాధారణంగా తెలియని వ్యక్తుల ఇళ్లలోకి వారి అనుమతి లేకుండా వెళితేనే దొంగ అనే ముద్ర వేస్తారు.

 Japanese Man Arrested For Breaking Into 1000 Homes Because It Relieves Stress De-TeluguStop.com

పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి కటకటాల వెనక్కి నెడతారు.అయితే ఒక వ్యక్తి ఇది నేరం అని తెలిసినా పట్టించుకోలేదు.

జపాన్( Japan ) దేశానికి చెందిన ఈయన అక్కడ ఏకంగా 1000 మంది ఇళ్లల్లోకి చొరబడ్డాడు.

వివరాల్లోకి వెళితే, ఫుకుయోకా ప్రిఫెక్చర్‌లోని దజైఫు నగరంలో( Dazaifu ) ఒక 37 ఏళ్ల జపాన్‌ వ్యక్తిని తాజాగా పోలీసులు అరెస్టు చేశారు.

ఈయన ఒత్తిడిని తగ్గించుకోవడానికే( Stress Relief ) 1000కు పైగా ఇళ్లల్లోకి అక్రమంగా ప్రవేశించాడట.ఒక సెల్ఫ్ ఎంప్లాయ్డ్‌ వ్యక్తి ఇంటిలోకి ప్రవేశించినప్పుడు అతన్ని పట్టుకున్నారు.

Telugu Homes, Dazaifu, Japanese, Stress, Impact, Unusual Hobby-Telugu NRI

ఆ ఇంటి దంపతులు తమ ఆవరణలో చొరబాటుదారుడు ఉన్నట్లు గమనించి వెంటనే భద్రతా సిబ్బందిని పిలిచారు.పోలీసుల ప్రశ్నించగా, ఆ వ్యక్తి, “ఇతరుల ఇళ్లలోకి చొరబాటు చేయడం నాకు హాబీ.నేను ఇలా 1000కు పైగా సార్లు చేశాను” అని అంగీకరించాడు.“ఎవరైనా నన్ను పట్టుకుంటారేమో అని నేను చాలా ఉత్సాహంగానూ, ఒత్తిడిగానూ ఉంటాను.నా చేతుల్లో చెమటలు పట్టడం నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది.ఇది నా ఒత్తిడిని తగ్గిస్తుంది” అని వివరించాడు.ఆశ్చర్యకరంగా, ఆ వ్యక్తి చొరబాటు చేసిన ఇళ్ల నుంచి ఏమీ దొంగతనం చేయలేదని పోలీసులు ధృవీకరించారు.

Telugu Homes, Dazaifu, Japanese, Stress, Impact, Unusual Hobby-Telugu NRI

ఈ విచిత్రమైన వ్యక్తి పేరు యుటా సుగవార. ఆ సిటీలోనే అతను ఒక ఆఫీసులో పనిచేస్తున్నాడు.అయితే అక్కడి పోలీసులు ఈ వ్యక్తి నిజం చెప్తున్నాడా, అబద్ధం చెప్తున్నాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

అతను ఇప్పటిదాకా ఎన్ని ఇళ్లల్లోకి ఇలా దొంగతనంగా ప్రవేశించాడు? ఎవరికైనా ఏదైనా హాని కలిగించాడా అనే కోణంలో కూడా ఆరా తీస్తున్నారు.అలాగే అందరి కళ్లుగప్పి ఇతను ఎలా ఇళ్లలోకి వెళ్తున్నాడో అడిగి తెలుసుకుంటున్నారు.

తద్వారా భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలని చూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube