ఇది కదా ట్రెండ్ అంటే.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వంటమనిషి సీవీ

ప్రస్తుత రోజుల్లో ఉద్యోగం రావాలంటే ఎన్ని తిప్పలు పడాల్సిన పరిస్థితిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.కాలేజీ చదువుతున్న సమయంలోనే ఆన్ క్యాంపస్లో ఉద్యోగాలు సంపాదిస్తే సరి.

 Homely Meals Specialist Man Makes Cooks Impressive Cv Viral Details, Social Medi-TeluguStop.com

ఒకవేళ కాలేజీ దాటి బయటికి వచ్చి ఉద్యోగాలు సాధించాలంటే అంత ఆషామాసి విషయం సాగడం లేదు.ఇక కాలేజ్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఉద్యోగం వెతికే క్రమంలో మొదటగా వారి స్కిల్స్ పొందుపరిచిన సివి( CV ) ఎంతో ముఖ్యం.

నిజానికి ప్రస్తుతం చాలా కంపెనీలు సివిని బాగా పరిశీలించిన తర్వాతనే వారిని ఇంటర్వ్యూకు పిలుస్తున్నాయి.ఈ నేపథ్యంలో ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు సివిలో వారికి సంబంధించిన ప్రతి విషయాన్ని, ప్రతి టెక్నాలజీ సంబంధించిన విషయాలను పొందుపరిస్తే తప్పించి ఇంటర్వ్యూకు కాల్స్ రావడం లేదు.

ఈరోజు కేవలం బయట ఆఫీసులలో పనిచేసే వారికి మాత్రమే కాకుండా ఇంటిలో పనిచేసే పనులకు కూడా ఇప్పుడు సివి రెడీ అయిపోయింది.ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.

ఉర్వి( Urvi ) అనే ఒక సోషల్ మీడియా వినియోగదారుడు నెట్టింట షేర్ చేసిన పోస్ట్ ఊహించిన విధంగా వైరల్ అవుతుంది.బెంగళూరు నగరంలోని( Bengaluru ) హెచ్ఎస్ఆర్ ప్రాంతంలో సింపుల్ హోమ్లీ ఫుడ్ తయారు చేయగల కుక్( Cook ) కోసం సిఫారసు చేయాలని ఆవిడ కోరింది.దాంతో వరుణ్ పేరు అనే వ్యక్తి నుంచి వచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో హార్ట్ టాపిక్ గా మారింది.ఉర్వి పోస్ట్ ను చూసిన బెంగళూరు నివాసి వరుణ్ పేరు తన వంట మనిషి రీతు సివిని షేర్ చేశాడు.

అలా సివిని షేర్ చేస్తూ ఆమెను కుక్ ఉద్యోగానికి పరిగణించమని కోరాడు.ఇందులో భాగంగా ఆమె ఇంటి భోజనం తయారీలో పని అద్భుతంగా ఉందని, ఇక వంట మనిషి రీతు( Chef Ritu ) నైపుణ్యాలు, ఇంకా ఆవిడ ఎలాంటి ఆహార పదార్థాలు చేయడంలో నిపుణురాలని తెలుపుతూ సివిలో పేర్కొన్నాడు.అంతేకాదండోయ్.ఇంట్లో వంట గదిని పరిశుభ్రంగా ఉంచుతూ.గ్యాస్, ఇండక్షన్ స్టవ్స్ ఉపయోగించి వంట చేయడంలో ఆమె అందవేసిన చేయి అంటూ వివరించాడు.ఏది ఏమైనా వంట మనిషికి కూడా ఇప్పుడు సివి వైరల్ కావడంతో అతనిపై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube