చిగుళ్ల వాపుకు చెక్ పెట్టే ఎఫెక్టివ్ హోమ్ రెమెడీస్ ఇవే..

చిగుళ్ల వాపు.ఏదో ఒక స‌మ‌యంలో దాదాపు అంద‌రూ ఫేస్ చేసే స‌మ‌స్య ఇది.

 Effective Home Remedies For Swollen Gums! Home Remedies, Swollen Gums, Oral Heal-TeluguStop.com

దంత స‌మ‌స్య‌ల్లో చిగుళ్ల వాపు కామ‌న్‌గా క‌నిపిస్తుంటుంది.దంత సంరక్షణ లేక‌పోవ‌డం, తిన్న ఆహారం చిగుళ్ళకు దంతాలకు మధ్య ఇరుక్కోవ‌డం, బాక్టీరియా, విట‌మిన్ లోపం ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల చిగుళ్ల వాపు స‌మ‌స్య ఏర్ప‌డుతుంది.

అయితే చిగుళ్ల వాపు చిన్న స‌మ‌స్యే అయిన‌ప్ప‌టికీ.చాలా బాధాక‌రంగా ఉంటుంది.ఎందుకంటే, చిగుళ్లు వాచిన‌ప్పుడు నొప్పి భ‌రించ‌లేనంత తీవ్రంగా ఉంటుంది.

దీంతో చాలా మంది చేసే పొర‌పాటు పెయిన్ కిల్ల‌ర్స్ వేసేసుకోవ‌డం.

కానీ, న్యాచుర‌ల్‌గా కూడా చిగుళ్ల వాపును, వాని వ‌ల్ల వ‌చ్చే నొప్పిని నివారించుకోవ‌చ్చు.మ‌రి న్యాచుర‌ల్ టిప్స్ ఏంటీ అన్న‌ది ఆల‌స్యం చేయ‌కుండా ఓ లుక్కేసేయండి.

చిగుళ్ల వాపు స‌మ‌స్య‌తో బాధ ప‌డుతున్న వారు ప‌సుపును ప‌ళ్ల‌కు, చిగుళ్ల‌కు అప్లై చేసి.ప‌ది లేదా ప‌దిహేను నిమిషాల పాటు వ‌దిలేయాలి.

అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో నీటిని శుభ్రం క్లీన్ చేసుకోండి.ఇలా రెగ్యుల‌ర్‌గా చేస్తే.

పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్‌, యాంటీ ఇన్ఫ్లమేటరీ మ‌రియు కుర్కుమిన్ చిగుళ్ల వాపును త‌గ్గించి దంత ఆరోగ్యాన్ని పెంచుతుంది.

Telugu Tips, Latest, Oral, Swollen Gums, Teeth-Telugu Health - తెలుగ�

ఇక చిగుళ్ల వాపును త‌గ్గించ‌డంలో క‌ల‌బంద‌ కూడా అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.ఇంట్లో పెరిగిన క‌ల‌బంద మొక్క నుంచి చిన్న భాగం తీసుకుని.జెల్ తీసుకోవాలి.

ఆ జెల్‌ను చిగుళ్ల‌కు, ప‌ళ్ల‌కు అప్లై.ప‌ది నిమిషాల అనంత‌రం చ‌ల్ల‌టి నీటితో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

ప్ర‌తి రోజు ఇలా చేస్తే.చిగుళ్ల వాపు త‌గ్గుముఖం ప‌డుతుంది.

అయితే ఇలా చేసిన‌ప్పుడు నోరు చేదుగా మారుతుంది.కానీ, ఎలాంటి భ‌యం ప‌డాల్సి అవ‌స‌రం లేదు.

అలాగే చాలా మంది గ్రీన్ టీ తాగిన త‌ర్వాత .ఆ గ్రీన్ టీ బ్యాగ్‌ను ప‌డేస్తుంటారు.కానీ, గ్రీన్ టీ బ్యాగ్‌తో చిగుళ్ల వాపు నుంచి త్వ‌ర‌గా ఉప‌శ‌మ‌నం పొందొచ్చు.అదెలా అంటే.గ్రీన్ టీ బ్యాగ్‌ను వాడిన త‌ర్వాత ప‌డేయ‌కుండా ఫ్రిజ్‌లో పెట్టాలి.అర‌గంట త‌ర్వాత ఆ టీ బ్యాగ్‌ను తీసుకుని.

చిగుళ్ల వాపు ఉన్న ప్రాంతంలో కాపుకోవాలి.ఇలా త‌ర‌చూ చేస్తుంటే.

చిగుళ్ల వాపు నుంచి త్వ‌ర‌గా ఉప‌శ‌మ‌నం పొందుతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube