రాజనాల.తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్టీఆర్, ఏఎన్నార్, కాంతారావు సమయంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఓ వెలుగు వెలిగిన నటుడు ఆయన.ముస్టి యుద్ధాలు మొదలు కొని కత్తి తిప్పడం వరకు ఆయన అన్నింటిలో అందవేసిన వాడు.హీరోలు ఎవరైనా ఈయన లేకుంటే ఆ సినిమా అంతగా సక్సెస్ అయ్యేది కాదు.
ఆయన ఎక్కువగా రాజు వెనకాల, రాణి తమ్ముడిగా, యువరాణి బావగా ఎన్నో పాత్రల్లో నటించాడు.అయితే ఈయన తెరమీద కనిపిస్తే చాలు చాలా మంది జనాల భయపడేవారట.
సినిమాల్లో ఆయన ఎక్కువగా మోసాలు, హత్యలు చేసే పాత్రల్లోనే కనిపించే వాడు.ఈయను జనాలు మంచి నటుడిగా కాకుండా విలన్ గానే చూసేవారు.
సినిమాల్లో క్రూర విలన్ గా నటించిన రాజనాల నిజానికి గొప్ప ఆశావాది.మంచి కళా ప్రేమికుడు.మనసున్న మనిషి.రాజనాల అసలు పేరు రాజనాల కాళేశ్వర్ రావు.
చాలా మంది ఆయనను రాజనాల కల్లయ్య అనేవారు.నెల్లూరు జిల్లా కావలిలో జన్మించిన ఆయన నాటకాల్లో రాణించి సినిమాల్లోకి వచ్చాడు.
తొలుత ఆయన ప్రతిజ్ఞ అనే సినిమాలో విలన్ పాత్రలో నటించాడు.ఆ తర్వాత విల్ పాత్రలు వరుసగా చేశాడు.
ఆయన క్రూరమైన చూపు, నవ్వు అన్నీ కలిపి మంచి ప్రతినాయకుడి గుర్తింపు తెచ్చాయి.రాజనాల హాలీవుడ్ సినిమాలు కూడా చూసేవాడు.
ఆ సినిమాల్లో విలన్ వేషధారణ, ముఖకదలికలను ఆయన పసిగట్టేవాడు.అటు మాయా ది మెగ్నిషిమెంట్ అనే హాలీవుడ్ సినిమాలో కూడా నటించి మెప్పించాడు.
హాలీవుడ్ లో నటించిన తొలి తెలుగు నటుడు కూడా ఆయనే కావడం విశేషం.సుమారు 25 ఏండ్ల పాటు సినిమా రంగంలో కొనసాగాడు.
విలన్ గా, కమెడియన్ గా తెలుగు, తమిళ భాషల్లో దుమ్మురేపాడు.

అటు తన సొంతూరుకు దగ్గర్లో ఆయనకు ఓ తోట ఉండేది.ఎన్టీఆర్ లాంటి హీరోలు వచ్చినప్పుడు వారిని ఆ విశాలమైన తోటకు ఆహ్వానించేవాడు.చాలా మంది ఆ తోటను తమ విడిదిగా భావించే వారు.
నాలుగు దశాబ్దాల పాటు 400 పైగా సినిమాల్లో నటించాడు.రాజనాలకు ఓసారి మధుమేహం వచ్చింది.
చికిత్స చేయలోమని డాక్టర్లు చెప్పడంతో కాలు కొట్టివేశారు.అయినా తను ఏనాడు నిరాశ చెందలేదు.