టాలీవుడ్ హీరో మంచు విష్ణు( Hero Manchu Vishnu ) డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న చిత్రం భక్తకన్నప్ప.ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.
కోట్ల బడ్జెట్ తో భారీ అంచనాల నడుమ ఈ సినిమా నిర్మితమవుతోంది.ఈ సినిమాలో చాలామంది స్టార్ సెలబ్రిటీలు( Star celebrities ) నటిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన చాలా అప్డేట్లు విడుదల చేశారు మూవీ మేకర్స్.ఆ అప్డేట్లు సినిమాపై అంచనాలను పెంచేశాయి.
ఇది ఇలా ఉంటే ఇటీవల కాలంలో ఈ సినిమాకు సంబంధించి తరచూ ఏదో ఒక అప్డేట్ సోషల్ మీడియాలో వినిపిస్తున్న విషయం తెలిసిందే.అందులో భాగంగానే తాజాగా మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అదేమిటంటే మంచు ఫ్యామిలీ( Manchu Family ) నుంచి ఇప్పుడు మరొక తరం తెర మీద అలరించేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది.కాగా ఇప్పటికే భక్తకన్నప్ప సినిమాలో మంచు విష్ణు కుమారుడు నటిస్తున్న విషయం తేలిసిందే.ఈ మూవీ నుంచి అవ్రామ్ లుక్ రిలీజ్ చేయగా మంచి ఆదరణ లభించింది.తాజాగా విష్ణు కుమార్తెలు అరియానా, వివియానా( Ariana, Viviana ) ఈ చిత్రంలో కనిపించనున్నట్లు మోహన్‌బాబు తెలిపారు.
వీరి పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప లో వీరికి సంబంధించిన ఫొటోను పంచుకున్నారు.కన్నప్ప సినిమాతో నా మనవరాళ్లు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నందుకు ఆనందిస్తున్నాను.
నటనపై వాళ్లకు ఉన్న అభిరుచి చూసి నాకెంతో గర్వంగా ఉంది.పరిశ్రమలో వారికి గుర్తింపు రావాలని ఎంతో మందిలో స్ఫూర్తి నింపాలని కోరుకుంటున్నాను అని పోస్ట్ లో రాసుకొచ్చారు మోహన్ బాబు.ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.కాగా ఈ సినిమాలో మంచు విష్ణు కుమారుడు అవ్రామ్ తిన్నడుగా నటిస్తున్న విషయం తెలిసిందే.
మంచు విష్ణు చిన్నప్పటి పాత్రను ఇందులో అవ్రామ్ పోషించనున్నాడు.