పుష్ప2 సినిమాను బాయ్ కాట్ చేయడం రైటేనా.. వ్యతిరేకతకు అసలు కారణాలివే!

టాలీవుడ్ పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్ ( Allu Arjun )హీరోగా నటించిన పుష్ప2 సినిమా మరొక మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ మూవీ కోసం పాన్ ఇండియా అభిమానులు ఎంతో అద్భుతంగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.

 Boycott Pushpa 2 Why This Much Hatred, Pushpa 2, Tollywood, Allu Arjun, Boycott-TeluguStop.com

మూవీ మేకర్స్ కూడా ఈ సినిమా ప్రమోషన్స్ ని వేగవంతం చేశారు.ఇకపోతే ఆ సంగతి పక్కన పెడితే మామూలుగా పెద్ద పెద్ద సినిమాలు విడుదల అవుతున్నాయి అంటే చాలు సినిమా టికెట్ రేట్లను పెంచేస్తూ ఉంటారు.

ఇది ఎప్పటి నుంచో కొనసాగుతూ వస్తున్న విషయం తెలిసిందే.అయితే పెద్ద సినిమాల టికెట్ రేట్ల పెంపు వెనక ఉద్దేశం వేరు.

బాహుబలి 2( Baahubali 2 ) లాంటి విజువల్ వండర్స్, కల్కి లాంటి పాన్ ఇండియా సినిమాలు రావాలంటే భారీ బడ్జెట్స్ అవసరం కాబట్టి టికెట్ రేట్లపై కొంత సడలింపు ఇవ్వాలనేది ప్రభుత్వ ఉద్దేశం.

Telugu Allu Arjun, Boycott, Boycottpushpa, Pushpa, Tollywood-Movie

అయితే రానురాను ఈ ప్రత్యేక మినహాయింపును దుర్వినియోగం చేయడం, క్యాష్ చేసుకోవడం మొదలైంది.ఈ దుర్వినియోగాన్ని పుష్ప2 మేకర్స్( Pushpa2 Makers ) పీక్ స్టేజ్ కు తీసుకెళ్లారని ఆరోపిస్తున్నారు ప్రేక్షకులు.ఇదే క్రమంలో ఇలాంటి జీవో ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వంపై కూడా విమర్శలు చేస్తున్నారు.

రిలీజైన మొదటి వారం లేదా 10 రోజుల పెంపును ఇన్నాళ్లూ భరిస్తూ వచ్చారు.ఇంకా చెప్పాలంటే దానికి అలవాటు పడ్డారు.కానీ పుష్ప2 విషయంలో గేట్లు బార్లా తెరిచేశారు.ఏకంగా 19 రోజుల పాటు టికెట్ రేట్లపై వివిధ స్థాయిల్లో పెంపు అనేది ఇప్పటివరకు ఏ సినిమాకూ జరగలేదు.

పెద్దగా గ్రాఫిక్స్, భారీ సెట్స్ అవసరం లేని ఒక సినిమాను మూడేళ్లు తీసి, ఆ భారాన్ని ప్రేక్షకులపై మోపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.అలా మొదలైందే బాయ్ కాట్ పుష్ప2 ట్రెండ్.

దీంతో ఈ విషయంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు ప్రేక్షకులు.

Telugu Allu Arjun, Boycott, Boycottpushpa, Pushpa, Tollywood-Movie

టికెట్ రేట్లను ఇష్టమొచ్చినట్లు పెంచుకుంటూ పోతే సామాన్యుల పరిస్థితి ఏమిటి? సామాన్యులు సినిమాలు చూడాలా వద్దా? ఎవడబ్బ సొమ్మని టికెట్లు పెంచుతున్నారు అంటూ మండిపడుతున్నారు.రైతులకు కనీసం మద్దతు ధర పించమని బ్రతిమలాడినా కూడా వెంచర్ కానీ సినిమాలకు మాత్రం టికెట్ రేట్లను అమాంతం పెంచేస్తున్నారు అంటూ ప్రేక్షకులు మండిపడుతున్నారు.అంత రేటు పెట్టే సినిమా చూసే బదులు కొద్దీ రోజులు ఓపిక పడితే ఓటీటీలో ( OTT )వస్తుంది కదా అని కొందరు కామెంట్స్ చేస్తుండగా మరికొందరు ఆ డబ్బుతో ఏడాది మొత్తం ఓటీటీ ప్లానే వస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇలా పుష్ప టు సినిమాపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత కనిపిస్తోంది.అయితే నిజానికి మొన్నటివరకు పుష్ప2పై ఈ స్థాయిలో వ్యతిరేకత లేదు.ఏదైనా ఎక్కడైనా కాస్త నెగెటివ్ కనిపించిందంటే అది పవన్ ఫ్యాన్స్ నుంచి మాత్రమే వచ్చింది.ఎప్పుడైతే టికెట్ రేట్లు ఇంత భారీగా పెంచేశారో అప్పుడు సామాన్య ప్రేక్షకుడికి కోపం వచ్చింది.

సరిగ్గా విడుదలకు 2 రోజుల ముందు ఈ కోపం సినిమాకు మంచిది కాదు.మరి ఈ విషయంపై మూవీ మేకర్స్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.సినిమా టికెట్ రేట్లను తగ్గించకపోతే అది కలెక్షన్ల పై తీవ్రంగా ప్రభావాన్ని చూపిస్తుంది అని చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube