ఆ విషయంలో నిజంగానే చాలా కోపం వస్తుంది... అసలు విషయం బయటపెట్టిన దేవిశ్రీ!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్ తో మంచి సక్సెస్ అందుకున్న దేవి శ్రీ ప్రసాద్( Devi sri Prasad ) గత కొద్దిరోజులుగా వార్తలలో నిలుస్తున్న విషయం మనకు తెలిసిందే.మైత్రి మూవీ మేకర్స్ వారితో ఈయనకు విభేదాలు వచ్చాయని అందుకే ఈయన తప్పుకోవడంతో తమన్ ఈ సినిమాలో భాగమయ్యారు అంటూ వార్తలు వచ్చాయి.

 Devi Sri Prasad Interesting Comments On Rashmika Details,devi Sri Prasad , Allu-TeluguStop.com

ఇక ఈ సినిమా చెన్నై ఈవెంట్ లో కూడా దేవిశ్రీప్రసాద్ వేదికపై మాట్లాడుతూ ఏదీ కూడా ఎవరు మనకు ఇవ్వరు మనమే ఏదైనా అడిగి తీసుకోవాలి అది రెమ్యూనరేషన్ అయినా కూడా అంటూ ఈయన మాట్లాడటంతో మైత్రి వారితో ఈయనకు ఏదో మనస్పర్ధలు వచ్చాయని స్పష్టంగా అర్థం అవుతుంది.

Telugu Allu Arjun, Devi Sri Prasad, Devisriprasad, Pushpa, Pushpa Pre, Pushpa Ra

ఇలా దేవి శ్రీ ప్రసాద్ మాట్లాడినప్పటి నుంచి మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు ఎక్కడికి వెళ్లినా మాకు దేవిశ్రీ తో ఎలాంటి గొడవలు లేవంటూ పదేపదే చెప్పుకువస్తున్నారు.ఇకపోతే తాజాగా హైదరాబాద్లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో కూడా సుకుమార్ అల్లు అర్జున్( Allu Arjun ) అలాగే నిర్మాతలు దేవి శ్రీ ప్రసాద్ పై పెద్ద ఎత్తున పొగడ్తల వర్షం కురిపించిన విషయం తెలిసిందే.ఇక ఈ కార్యక్రమంలో భాగంగా దేవి శ్రీ ప్రసాద్ వేదికపై మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Telugu Allu Arjun, Devi Sri Prasad, Devisriprasad, Pushpa, Pushpa Pre, Pushpa Ra

అల్లు అర్జున్ గురించి ఆయనతో తన ఫ్రెండ్షిప్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టిన దేవి  శ్రీ ప్రసాద్ అనంతరం రష్మిక( Rashmika ) గురించి కూడా మాట్లాడారు.ఈమె గురించి మాట్లాడడానికి ముందు చూపే బంగారమాయేనే అంటూ శ్రీవల్లి గురించి పాట పాడుతూ .శ్రీవల్లి అంటే పుష్పరాజ్ భార్య గానే ఊహించుకుంటున్నాను అని, రష్మిక ఏ హీరో సినిమాలో కనిపించిన అదేంటి మా పుష్పరాజ్ భార్య కదా వేరే హీరోతో నటిస్తోంది ఏంటి .? అంటూ కోపం వచ్చేస్తుందనీ సరదాగా మాట్లాడి స్టేజిపై నవ్వులు పూయించాడు.ఇలా రష్మిక గురించి దేవి శ్రీ ప్రసాద్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube