యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) అభిమానులు తమ ఫేవరెట్ హీరోను ఎంతలా అభిమానిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.జూనియర్ ఎన్టీఆర్ ఈ ఏడాది దేవర సినిమాతో( Devara ) బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు.
సోలో హీరోగా తారక్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ ఈ సినిమానే అనే సంగతి తెలిసిందే.దేవర సినిమాకు కళ్యాణ్ రామ్( Kalyan Ram ) సైతం ఒక నిర్మాతగా వ్యవహరించడం జరిగింది.
అయితే దేవర సినిమాకు ఆశించిన స్థాయిలో ప్రమోషన్స్ జరగలేదనే సంగతి తెలిసిందే.సరైన విధంగా ప్రమోషన్స్ జరగకపోవడం దేవర సినిమాకు మైనస్ అయిందని చాలామంది భావిస్తారు.పుష్ప2 సినిమాకు( Pushpa 2 ) చేసిన స్థాయిలో దేవర సినిమాకు ప్రమోషన్స్ చేసి ఉంటే ఈ సినిమా రేంజ్ మరింత పెరిగేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి.కళ్యాణ్ రామ్ నిర్మాత అయ్యి కూడా లాభం లేకుండా పోయిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
ఎన్టీఆర్ తర్వాత సినిమాల ప్రమోషన్స్ విషయంలో కళ్యాణ్ రామ్ ఇలాంటి తప్పులు చేయకూడదని కామెంట్లు చేస్తున్నారు.సాధారణంగా కళ్యాణ్ రామ్ సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నారు.దేవర సినిమాకు ఒక్క ఈవెంట్ కూడా చేయకపోవడం ఫ్యాన్స్ ను బాధ పెట్టింది.ఎన్టీఆర్ సైతం తన సినిమాల ప్రమోషన్స్ విషయంలో జాగ్రత్త వహించాల్సి ఉంది.
సినిమాల ప్రమోషన్స్ కు సంబంధించి ఎలాంటి పొరపాట్లు జరగకుండా తారక్ అడుగులు వేస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ లుక్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటుండగా తర్వాత సినిమాలు తారక్ కు భారీ హిట్లను అందించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.వార్2 మూవీ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో హిట్టవుతుందో చూడాలి.వార్2 సినిమా బడ్జెట్ 500 కోట్ల రూపాయలు అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.