న్యూయార్క్‌లోని వికాస్ ఖన్నా రెస్టారెంట్‌కు వీర్ దాస్ .. గర్వపడుతున్నానంటూ పోస్ట్

భారత సంతతికి చెందిన హాస్యనటుడు వీర్ దాస్.( Comedian Veer Das ).

 Comedian Vir Das Visited Celebrity Chef Vikas Khanna’s Restaurant In New York-TeluguStop.com

సెలబ్రిటీ చెఫ్ వికాస్ ఖన్నాకు చెందిన ప్రఖ్యాత న్యూయార్క్ సిటీ రెస్టారెంట్,( New York City Restaurant ) బంగ్లాను సందర్శించాడు.దీనికి సంబంధించిన ఫోటోలను ఆయన షేర్ చేయగా.

అమెరికాలో భారతీయుల సక్సెస్‌పై ఇది నెట్టింట పెద్ద చర్చకు దారి తీసింది.ప్రపంచంలోనే అత్యంత డిమాండ్ వున్న నగరంలో భారతీయుల రెస్టారెంట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

ఇదే పోస్ట్‌లో తాను గతంలో అమెరికన్ రెస్టారెంట్‌లలో పనిచేసిన రోజులను వీర్ దాస్ గుర్తుచేసుకున్నారు.ఖన్నా సాధించిన విజయాన్ని చూసి భారతీయుడిగా తాను గర్వపడుతున్నానని దాస్ అన్నారు.

కాగా.కొద్దినెలల క్రితం స్టార్ సెలబ్రిటీ చెఫ్ వికాస్ ఖన్నా (Chef Vikas Khanna )గెజిట్ రివ్యూ ద్వారా ప్రపంచంలోని టాప్ 10 గ్లోబల్ చెఫ్‌లలో ఒకరిగా నిలిచిన సంగతి తెలిసిందే.అంతేకాదు.ఈ ప్రతిష్టాత్మక జాబితాలో స్థానం సంపాదించిన ఏకైక భారతీయ చెఫ్‌గా నిలిచారు.

ఈ గెజిట్ రివ్యూ ఖన్నాకు ఆరవ ర్యాంక్ ఇచ్చింది.బ్రిటీష్ చెఫ్ గోర్డాన్ రామ్‌సే ఈ జాబితాలో అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నారు.

ఆంథోనీ బౌర్టెన్, పాల్ బోకస్, అలైన్ డుకాస్సే, ఎమెరిల్ లగాస్సే, మార్కో పియరీ వైట్, పెస్టన్ బ్లూమెంటల్, వోల్ఫ్ గ్యాంగ్ పుక్, జామీ ఆలివర్‌ వంటి దగ్గజ చెఫ్‌లు ఈ జాబితాలో వున్నారు.

Telugu Barack Obama, Vir Das, Virdas, Dalai Lama, York, York Restaurant, Pope Fr

52 ఏళ్ల వికాస్ ఖన్నా పంజాబ్‌లోని అమృత్‌‌సర్‌లో జన్మించారు.అనంతరం వీరి కుటుంబం అమెరికాకు వలస వచ్చి న్యూయార్క్‌లో స్థిరపడింది.భారతీయ వంటకాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం కల్పించడంలో ఖన్నా కీలకపాత్ర పోషించారు.

ఈ రంగంలో మంచి పేరు సాధించిన అతి కొద్దిమంది భారతీయ చెఫ్‌లలో ఆయన కూడా ఒకరు.

Telugu Barack Obama, Vir Das, Virdas, Dalai Lama, York, York Restaurant, Pope Fr

బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన వికాస్ ఖన్నాలో చెఫ్‌తో పాటు రచయిత, చిత్ర నిర్మాత కూడా వున్నారు.2011 నుంచి న్యూయార్క్‌లోని అతని రెస్టారెంట్ జునూన్ మిచెలిన్‌లో భారతీయ వంటకాలను అందిస్తోంది.అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, దలైలామా, పోపో ఫ్రాన్సిస్, భారత ప్రధాని నరేంద్ర మోడీ వంటి ప్రముఖులకు వికాస్ తన వంటకాలను రుచి చూపించారు.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వంటల పుస్తకాన్ని వికాస్ ఖన్నా రూపొందించడంతో పాటు మాస్టర్ చెఫ్ ఇండియా ఐదు సీజన్‌లకు హోస్ట్‌గా వ్యవహరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube