టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ( Nandamuri family )ఉన్న క్రేజ్, గుర్తింపు అంతాఇంతా కాదు.నందమూరి బాలయ్య ఇప్పటికే భారీ విజయాలను ఖాతాలో వేసుకున్నారు.
అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో మాస్ ప్రేక్షకులను మెప్పించడంలో బాలయ్య నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యారు.అయితే మోక్షజ్ఞ సినిమాలకు సంబంధించి దర్శకుల ఎంపిక ఫ్యాన్స్ ను ఒకింత టెన్షన్ పెడుతోంది.
హనుమాన్ మినహా ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలేవీ మరీ భారీ స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేదు.మోక్షజ్ఞ , ప్రశాంత్ వర్మ ( Mokshajna, Prashant Verma )కాంబో సినిమా విషయంలో ఫ్యాన్స్ కు ఇప్పటికే ఊహించని స్థాయిలో టెన్షన్ ఉంది.
అదే సమయంలో మోక్షజ్ఞ రెండో సినిమా వెంకీ అట్లూరి ( Venky Atluri )డైరెక్షన్ లో తెరకెక్కనుంది.తొలిప్రేమ, సార్, లక్కీ భాస్కర్ సినిమాలతో వెంకీ అట్లూరి విజయాలను అందుకున్నారు .
ఈ మూడు సినిమాలు సక్సెస్ సాధించినా కమర్షియల్ గా భారీ హిట్లు అయితే కాదనే సంగతి తెలిసిందే.ఇలాంటి డైరెక్టర్ కు బాలయ్య ఛాన్స్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.బాలయ్య తలచుకుంటే పాన్ ఇండియా డైరెక్టర్లు మోక్షజ్ఞతో సినిమాలను తెరకెక్కించడానికి ఇష్టపడతారు.మరి బాలయ్య ఈ దిశగా ఎందుకు అడుగులు వేయట్లేదో తెలియాల్సి ఉంది.
మోక్షజ్ఞకు ఫస్ట్ మూవీతోనే పాన్ ఇండియా స్టేటస్ దక్కాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.మోక్షజ్ఞ టాలీవుడ్ ఇండస్ట్రీలో గట్టి పోటీ నేపథ్యంలో ఏ విధంగా అడుగులు వేస్తాడో చూడాల్సి ఉంది.సరైన ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే మాత్రం మోక్షజ్ఞ టాలీవుడ్ బెస్ట్ హీరోలలో ఒకరిగా నిలిచే ఛాన్స్ ఉంటుంది.మోక్షజ్ఞ ఫస్ట్ మూవీలో బాలయ్య నటిస్తాడా లేదా అనే చర్చ సైతం సోషల్ మీడియా వేదికగా జరుగుతుండటం గమనార్హం.
మోక్షజ్ఞ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంది.