జానీ మూవీపై జరిగిన ప్రయోగాలు తెలిస్తే ..?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన సినిమా జానీ.ఆయన సినీ కెరీర్ లో అతి పెద్ద డిజాస్టర్ గా మిగిలిన మూవీ.

 Unknown Facts About Johnny Movie, Johnny Movie, Pawan Kalyan, Renu Desai, Johnny-TeluguStop.com

రేణు దేశాయ్ తో కలిసి నటించిన ఈ సినిమా 2003 ఏప్రిల్ 25న విడుదల అయ్యింది.కనీవినీ ఎరుగని రీతిలో ప్రపంచ వ్యాప్తంగా 250 ప్రింట్లతో రిలీజ్ అయ్యింది.

అయితే ఈ సినిమా కమర్షియల్ గా హిట్ కాలేదు.అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సినిమా విషయంలో ప్రయోగాలు జరిగాయి.

అంతేకాదు.పవన్ కెరీర్ లో ఓ మైల్ స్టోన్ గా నిలిచింది జానీ మూవీ.

ఇంతకీ ఈ సినిమా విషయంలో జరిగిన ప్రయోగాలు ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
జానీ సినిమా కోసం పవన్ కల్యాణ్ చాలా కష్టపడ్డాడు.

ఈ మూవీ ఫైట్స్ కోసం లాస్ ఎంజిల్స్ లో మాస్టర్ ఆర్ట్స్ నేర్చుకున్నాడు.ఐక్విడో కోసం జపాన్ వెళ్లాడు.

అక్కడ ప్రత్యేక నిపుణుడి పర్యవేక్షణలో ట్రైనింగ్ తీసుకున్నాడు.అటు ఈ సినిమాలో సాధారణ యువకుడిగా కనిపించడం కోసం పవన్ గుండు కొట్టించుకున్నాడు.

ఢిఫరెంట్ హెయిర్ స్టైల్ వచ్చేలా జుట్టు పెంచుకున్నాడు.ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో పాట స్ర్కీన్ ప్లే కూడా పవన్ కల్యాణే రాశాడు.

Telugu Johnny Fights, Johnny, Pawan Kalyan, Pawankalyan, Renu Desai, Renudesai-T

అటు ఈ సినిమాను 90 శాతం లైవ్ రికార్డింగ్ చేశారు.డబ్బింగ్ లేకుండా షూటింగ్ స్పాట్ లో చెప్పిన డైలాగులను ఫైనల్ అవుట్ ఫుట్ లో పెట్టారు.ఈ సినిమాలో రెండు పాటలను పవన్ కల్యాణ్ పాడాడు.నిజానికి ఈ సినిమాలో పవన్ రాసుకున్న కథలో హీరో చనిపోవాలి.కానీ అభిమానులు ఏమనుకుంటారో అని భావించి కథను మార్చారు.ఈ సినిమా డిజాస్టర్ గా మిగలడంతో పవన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు.

తను ఈ సినిమా కోసం తీసుకున్న పారితోషకంను తిరిగి వెనక్కి ఇచ్చాడు.నిర్మాత శ్రేయస్సు కోసం ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల అప్పట్లో పవన్ పై ప్రశంసలు కురిశాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube