జుట్టు ఒత్తుగా, అందంగా ఉంటే భలే ఉంటుంది అని చాలా మంది అనుకుంటారు.అయితే ఈ రోజుల్లో జుట్టు రాలిపోవడం అన్నది కామన్ సమస్య అయింది.
జీవనశైలి, కాలుష్యం, పోషకాహార లోపం, జన్యుపరమైన సమస్యలు మరియు జుట్టు సంరక్షణ వంటి అనేక అంశాలు జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.అందువల్ల జుట్టు ఆరోగ్యంగా ఎదగదు.
ఇక ఒక్కోసారి మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల కూడా జుట్టు సమస్యలు ఏర్పడతాయి.
అందులో రాత్రి వేళ తలస్నానం చేయడం కూడా ఒకటి.
తలస్నానం జుట్టు ఆరోగ్యానికి మంచిదే.కానీ, రాత్రి వేళలో చేయడం వల్ల అనేక సమస్యలు వస్తాయి.
రాత్రి సమయంలో తలస్నానం చేయడం వల్ల జుట్టు తేమగా ఉంటుంది.తద్వారా చుండ్రు, జుట్టురాలడం, ఇన్ఫెక్షన్స్ వంటి సమస్యలు ఎదురవుతాయి.
ఇవన్నీ జుట్టు బలహీనపడటానికి కారణంగా మారతాయి.
అంతేకాదు, రాత్రి వేళ తలస్నానం చేయడం వల్ల మైగ్రేన్, తలనొప్పి వంటి సమస్యలు కూడా వస్తాయి.
ఇక రాత్రి వేళలో తలస్నానం చేసి.తడి జుట్టుతో పడుకున్నప్పుడు జుట్టు మొత్తం ముద్దలా తయారవుతుంది.
ఇలా అయిన జుట్టును దువ్వడం వల్ల ఎక్కువ వెంట్రుకలు ఊడిపోతాయి.తద్వారా జుట్టు పలచబడిపోతుంది.
అలాగే సైనస్ ఉన్నవారు కూడా రాత్రి వేళ తలస్నానం చేస్తే సమస్య మరింత ఎక్కువ అవుతుంది.కాబట్టి, రాత్రి వేళ తలస్నానం చేయకపోవడమే మంచిది.అయితే తప్పనిసరి పరిస్థితిలో తలస్నానం చేయాల్సి వస్తే.తలస్నానం అనంతరం జట్టును బాగా అరబెట్టి.
జడ వేసుకుని పడుకుంటే మంచిది.